Skip to main content
తెనాలి రామకృష్ణకవి శబ్ద విచిత్రం !
తెనాలి రామకృష్ణకవి శబ్ద విచిత్రం !
..
కందర్పకేతువిలాసములోని ఈ పద్యం.
.
.
కమలాకరకమలాకర
కమలాకర కమల కమల కమలాకరమై
కమలాకర కమలాకర
కమలాకరమైన కొలను గని రా సుదతుల్.
.
ఈ పద్యం ఇచ్చి అర్థతాత్పర్యాలు చెప్పమనటం పరీక్షకులకూ, పరీక్ష్యులకూ
ఒక కేళీవినోదంకరణగా ఉండేదట.
మాడుగుల సంస్థానానికి వెళ్ళినపుడు అల్లమరాజు సుబ్రహ్మణ్యకవిగారిని
ఈ పద్యానికి అర్థం చెప్పమని అడిగారట...
,
.ఆ సుదతుల్ – అందమైన పలువరుసతో అలరారుతున్న ఆ సుందరాంగులు;
కమలా = లక్ష్మీదేవియొక్క,
కరకమల = పద్మము వంటి చేయి,
ఆకర = ఉనికిపట్టుగా కలిగిన,
కమల = తామరపూవునకు,
ఆకర = జన్మస్థానమై,
కమల కమల కమలాకరమై – కమల = బెగ్గురు పక్షులకు, కమల = పరిశుద్ధజలములకు, కమల + అ = పద్మములయొక్క సమూహమునకు, ఆకరమై = నివేశనమైనది;
కమలాకర – క = మన్మథునియొక్క, మ = సమ్మోహనకరమగు, లా = వశీకరణశక్తిని,
కర = కూర్చునదై, కమలాకర – కమలా = పద్మినీజాతి స్త్రీలకు,
క = శరీరములందు, ర = కామాగ్నిని ఉద్దీపింపజేయునదై,
కమలాకరము + ఐన = సర్వసంపత్ప్రదమైన, కొలనున్ = సరోవరమును
, కనిరి = నేత్రపర్వముగా వీక్షించిరి –
అని అన్వయించుకోవాలి.
Comments
Post a Comment