దీపావళి !

దీపావళి !

.



మన భారతీయ ఆధ్యాత్మిక ప్రపంచంలో పండుగలకు అధిక ప్రాధాన్యము ఉన్నది . వీటిలో దీపావళి పండుగ ఒకటి. ఈ పండుగను ఆశ్వీయుజమాస బహుళ అమావాస్య రోజున జరుపుకొంటారు . దీపావళి అనగా దీపములవరుస అని అర్ధము .ఈ జరుపుకొనుట యొక్క ప్రాముఖ్యతను పురాణాలలో అనేక విధములుగా తెలియజేసారు .

1. .విష్ణు స్వరూపుడైన శ్రీరామచంద్రుడు తండ్రి ఆజ్ఞను శిరసా వహించి పధ్నాలుగు (14 ) సంవత్సరములు అరణ్యవాసము చేసి తిరిగి సీతతో కలిసి రాజ్యమునకు వచ్చిన సంధర్బమున ప్రజలు ఆనందోత్సాహాలతోదీపములనలంకరించి జరుపుకొన్న పండుగ ను దీపావళి అంటారని,

2. విష్ణుమూర్తి వామన అవతరుడై రాక్షస రాజు బలిచక్రవర్తి ని మూడు అడుగుల నేలను అడిగి అతనిని పాతాళమునకు అనిచివేసినందుకు దేవతలు, నరులు అనందించి జరుపుకున్న పండుగ అని ,

3. ద్వాపరయుగమందు నరకాసురుడనే రాక్షసుని శ్రీ కృష్ణుడు తన భార్య సత్యబామతో కలిసి సంహరింఛినందుకు ప్రజలు ఆనందంతో ప్రతి యింటిని దీపములతో అలంకరించి జరుపుకున్న పండుగ అని అంటారు. దీపావళి రోజున ఇంటిలో ని పిన్నలు ,పెద్దలు తలస్నానమాచరించి ,ఇల్లు శుబ్రము చేసి ,ఇంటిని కొత్త సున్నముతో ను,రంగులతోను అలంకరించి ,ముగ్గులు పె ట్టి,నూతన వస్రములను ధరించి ,ఇంటి నిండా దీపములతో అలంకరించెదరు. కొందరు లక్ష్మీ పూజను జరుపుతారు .

దీపావళి పండుగను దీపోత్సవము అనికూడా అంటారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో దీపావళి రోజున శివ సహితముగా కాళీ పూజలు ప్రత్యేకముగా నిర్వహిస్తారు . ఈ పండుగనాడు అమావాస్య చీకట్లు తొలగిపోవుటకు కాకరపువ్వొత్తులు , టపాకాయలు ,చిచ్చుబుడ్లు ,మతాబులు ,మొదలగునవి కాల్చి పండుగగా జరిపి ఆనందిస్తారు.

నరకాసురుడు దేవతలను ,నరులను బహు కష్టములపాలు చేసి భగవంతుడైన శ్రీక్రుష్ణునే వ్యతిరేకించుచుండెను. 16 000 మంది స్త్రీలను చెరసాలలో బంధించి ఉంచగా శ్రీకృష్ణుడు యుద్దము చేసి సత్యభామచే నరకాసురిని సంహరింపజేసెను. ఎందువల్లననగా విష్ణుమూర్తి యొక్క వరహావతార సమయమున భూదేవికి ,విష్ణువుకు జన్మించినవాడు నరకాసురుడు.ఇతనికి తల్లి చేతిలో తప్ప మరో విధముగా చావులేదనే వరమున్నది. అందువల్ల శ్రీ కృష్ణుడు సత్యభామచే ఆశ్వీయుజ బహుళ చతుర్దశి నాడు నరకాసురవధ జరిపి మాతృభూమిని ఉద్దరించాడు . ఈ దీపావళిని నరకాసురవధ జరిగిన తరువాత ప్రజలు ఆనందించి జరుపుకున్న పండుగగా చెబుతారు .ఆనాటి నరకాసురుని రాజధాని ప్రస్తుత అస్సాం రాష్ట్రంలోని ప్రాగ్జోతిషపురము. శ్రీకృష్ణుని ద్వారకానగరము ఈనాటి గుజరాత్ రాష్ట్రములోని ద్వారక.

జైనులు మహావీరుడు నిర్యాణం పొందిన రోజును దీపావళిగా జరుపుకొందురు.స్వామి దయానంద సరస్వతి హిందూ ఆధ్యాత్మికత యొక్క గొప్పదనమును చాటుటకు అమావాస్య రోజునే సన్యాసము స్వీకరించుట జరిగినది. స్వామి రామతీర్థ కూడా పశ్చిమ దేశాలలో ఆధ్యాత్మికతను ,హిందు ధర్మాన్ని అందజేశారు.



Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!