చేతులారంగ శివుని బూజింపడేని

చేతులారంగ శివుని బూజింపడేని

నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని

దయయు సత్యంబులోనుగా దలపడేని

గలుగనేటికి దల్లుల కడుపు చేటు

పదవిభాగం

చేతులారంగ, శివుని, పూజింపడేని, నోరునొవ్వంగ, హరికీర్తి, నుడువడేని, దయయు, సత్యంబు, లోను, కాన్, తలపడేని, కలుగన్, ఏటికి, తల్లుల, కడుపు, చేటు.

భావం:

చేతులు జోడించి మనస్ఫూర్తిగా భక్తితో శివుడి (భగవంతుడు) ని పూజించనివాడు,

నోరారా ఆ విష్ణుమూర్తి సద్గుణాలను భక్తితో గానం చేయనివాడు, 

ఇతరప్రాణుల పట్ల దయతో లేనివాడు, నిరంతర అసత్యం చెబుతూ 

సత్యవర్తనం ఆచరింపనివాడు... మానవ జన్మ ఎత్తి ఉపయోగం లేదు..

Comments

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!