కొంకణంబు పోవ గుక్క సింహము కాదు


కొంకణంబు పోవ గుక్క సింహము కాదు
కాశి కరుగ బంది గజము కాదు
వేరు జాతి వాడు విప్రుడు కాలేడు
విశ్వదాభిరామ వినురవేమా ! "
" ఈ దేశము వదలి ఇతర దేశము వెళ్ళిననూ కుక్క సింహము కాదు
. కాశీ పట్టణమునకు పందివెళ్ళిననూ ఏనుగు కాదు.
ఇతర జాతి వాడు విప్రుడు కాలేడు సుమా !

.
విప్రుడు అంటే ప్రజలకు పెట్టించే వాడు, వేదాలు చదివినవాడు. పుట్టుకతో శూద్రత్వము , తదుపరి ఉపనయనము పొందినవాడు విప్రుడు అని అంటారు .......".
(విపరీతాత్ త్రాయతయితి విప్రః-వ్యుత్పత్తి; విపరీతములు - పాపములు, వానిఫలితములు;వాటినుండిరక్షణకలిపించేవాడనిఅర్ధం; యజ్ఙయాగాదులు, గ్రహశాంతులు, వ్రతములు, దానాదులు, యిత్యాదయః సూచించి పాప ముక్తి కలిగించేవాడని ఫలితార్ధం!)
.
॥ సర్వే జనా సుఖినో భవంతు ॥


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!