నేర్చుకుందాం.(4).. "ఉద్యోగం పురుష లక్షణం”!..... మహిళలకు గౌరవమివ్వడం పురుష లక్షణం!!


నేర్చుకుందాం.(4).. "ఉద్యోగం పురుష లక్షణం”!.....
మహిళలకు గౌరవమివ్వడం పురుష లక్షణం!!
.
ఇక్కడ ఉద్యోగం అంటే ‘ ప్రయత్నించడం’ అని అర్థం.
అంతేకాని ఉద్యోగం పురుషులే చేస్తారా? స్త్రీలు చేయరా? అని భావించ రాదు
ఉద్యోగం పురుష లక్షణం” అన్న వాక్యానికి పూర్తి శ్లోకం.

. “ అశ్వస్య లక్షణం వేగం – మదో మాతంగ లక్షణం/
చాతుర్యం లక్షణం స్త్రీణాం – ‘ ఉద్యోగం పురుష లక్షణం”//

“ గుఱ్ఱం యొక్క లక్షణం వేగంగా పరుగెత్తడం, మాతంగం అంటే ఏనుగు.
దాని లక్షణం మదం స్రవించడం, చతురతతో మాటాడటం స్త్రీల లక్షణం,
అలాగే ఏదైనా ప్రయత్నం చేయడం పురుషుల లక్షణం”
దూరం తగ్గాలంటే అడుగు ముందుకు పడాలి అదే ప్రయత్నం.
ఉన్నచోటే ఉంటే దూరం తరగదుకదా !?
ఇక్కడ మరో సామెత కలుపుదాం.

మహిళలకు గౌరవమివ్వడం పురుష లక్షణం!!

అనాదిగా మహిళలకు గౌరవం ఇచ్చే సంస్కృతి మనది.
కొన్ని జాఢ్యాల వల్ల మూఢత్వం పెరిగి మహిళల పట్ల చిన్నచూపు చూడటం ప్రారంభమైంది.
ఫలితంగా ఎన్నో ప్రతికూల ప్రభావాలు కనిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన ఉదాహరణగా లింగ నిష్పత్తిలో మార్పులు చోటు చేసుకోవడాన్నే చెప్పుకోవచ్చు. ఇదే సెక్స్ రేషియో కొనసాగితే మాత్రం మున్ముందు మరిన్న ఇక్కట్లు తప్పవు. అందుకే సమాజంలో మహిళలకు తగిన గౌరవంతో పాటు సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ప్రతి పురుషునిపై ఉందని చెప్పడమే కాకుండా పురుష లక్షణంగా చెప్పుకోవచ్చు.
(చిత్రం.... .Pvr Murty...గారు.)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!