నేర్చుకుందాం...(2)... యథా రాజా తథా ప్రజాః”!


నేర్చుకుందాం...(2)... యథా రాజా తథా ప్రజాః”!

.

“ రాజా రాక్షసశ్చైవ – శార్దూలాః తత్ర మంత్రిణ:/

గృధ్రాశ్చ సేవకాస్సర్వే – ‘ యథా రాజా తథా ప్రజాః”//

.
గీ. ప్రభువు మంచిగ నొప్పిన ప్రజలునటులె,

ప్రభువు చెడ్డవాఁడైనచో ప్రజలునటులె.
ప్రభువు యెటులుండు నటులనే ప్రజలునుంద్రు.
ప్రభువు మంచిగ వర్తించి వరల వలయు.
.
భావము. ప్రజలు ఎల్లప్పుడూపాలకుని మనస్సునే అనుసరింతురు.
రాజు ధర్మవంతుడైనచో ప్రజలు ధర్మ ప్రవర్తకులై యుందురు.
రాజు పాప ప్రవర్తకుఁడైనచో ప్రజలు కూడా పాప ప్రవర్తకులుగనే యుందురు
రాజెటు లుండునో ప్రజలూ అటులనే యుందురు.

రాజు మంచి వాడైతే మంత్రులు, సేవకులు, ప్రజలు మంచిగా ఉంటారు..
ఆ రాజే రాక్షసుడైతే – మంత్రులు పెద్దపులుల్లా, సేవకులు గ్రద్దల్లా వ్యవహరిస్తారు
. అందుకనే ‘ రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు’ అన్న నుడికారం పుట్టింది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!