భార్యలను "ఒసే" అని పిలవడం .!

భార్యలను "ఒసే" అని పిలవడం .!

(శ్రీ తుర్లపాటి కుటుంబరావుఆత్మకథవిషయపేజీలు నుండి.)

.

నా వివాహమైన తరువాత కూడా నా భార్యను "ఏమండీ!" అని సంబోధించే వాడిని! ఎందువల్ల నంటే, ఆమె నాకు పెళ్లికి పూర్వమే పరిచయం అయింది. అప్పుడు సహజంగా ఆమెను మీరు, ఏమండీ! అని సంబోధించేవాడిని.

ఔను! పెళ్లికి పూర్వం ఏమండీ! అని పిలిచిన వ్యక్తిని పెళ్లి కాగానే

"ఒసేయ్! ఏమేవ్‌!" అని పిలవాలా?

ఏమి! పెళ్లి కాగానే స్థాయి, విలువ, గౌరవం పెరగాలి కాని, తగ్గిపోవాలా?

అది పురుషాధిక్యతా మనస్తత్వం కాదా?

అంతకాలం "ఏమండీ!" అని పిలిచి, మూడు ముళ్లుపడగానే

భార్యకు బానిసత్వం, భర్తకు "బాస్‌ తత్వం" రావాలా?

ఈ ఆలోచనే ఆమెను "ఏమండీ!" అని పిలిపించింది!

Comments

  1. తుర్లపాటి కుటుంబరావు గారితో నూటికి నూరు శాతం ఏకీభవిస్తున్నాను. ఒసేయ్, ఏమే అని పిలవడం కుసంస్కారం, uncouth.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!