సౌందర్య లహరి (శ్రీ శంకర భగవత్పాద విరచితము) (శ్రీ లలితాంబికాయైనమఃశ్లోకము (22)

శుభం -
-

సౌందర్య లహరి

(శ్రీ శంకర భగవత్పాద విరచితము)

(శ్రీ లలితాంబికాయైనమః)

-

శ్లోకము (22)

భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణా

మితి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితియః,

తదైవం త్వం తస్మై దశసి నిజ సాయుజ్య పదవీం 

ముకున్ద బ్రహ్మేంద్ర స్ఫుట మకుటనీరాజిత పదామ్ !!

-

తల్లీ , ఓ భవునిరాణీ ! 

నేను నీ దాసుణ్ణి , నన్నుకటాక్షించు , 

అని ఉపాసకుడు ప్రార్థించ బోయి

సగం పలుకులు చెప్ప బోయేటంతటిలో అతడికి 

ముకుంద బ్రహ్మేంద్రులు తమ రత్న కిరీటాల చేత

నీరాజనం గావించ బడే నీ పాద పద్మాలు గలదైన

నీ సాయుజ్య స్థానాన్ని అతడికి ఒసగు తున్నావు.

.

ఓం కామకలనాయైనమః 

ఓం కాంక్షితార్థప్రదాయైనమః 

ఓం చద్రార్కాయుతతాటంకాయైనమః

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!