Skip to main content
శ్రీ సదాశివబ్రహ్మేంద్ర కీర్తనలలో అద్వైతా మృతం ఆత్మ బోధ!
-
-శ్రీ సదాశివబ్రహ్మేంద్ర కీర్తనలలో అద్వైతా మృతం ఆత్మ బోధ!
-
స్థిరతా నహి నహి రే, మానస
స్థిరతా నహి నహి రే॥
చరణము(లు):
తాపత్రయ సాగర మగ్నానాం
దర్పాహంకార విలగ్నానామ్॥
విషయపాశ వేష్టిత చిత్తానాం
విపరీతజ్ఞాన విమత్తానామ్॥
పరమహంసయోగ విరుద్ధానాం
బహు చంచలతర సుఖబద్ధానామ్॥.
-
భావం ——ఈ కీర్తన లో మనసుకు స్థిరత్వం అనేది లేదు
అని రూడ్డీ గా తెలియ జేశారు .-ఎవరికి లేదు ?
అని విచారించారు .
-
”మనసా !తాపత్ర్యాలలో మునిగిన వారికి ,
అహంకార దర్పాన్ని పట్టుకొని వ్రేలాడే వారికి ,
విషయ వాంచలు అనే తాళ్ళతో బద్ధులైన మనసు కల వారికి ,
చంచల మైన సుఖాల కోసం అర్రులు చాచే వారికి
ఎన్నడు మనశ్శాంతి లభించదు ”అని
నిర్ద్వందంగా చెప్పారు .
-
https://www.youtube.com/watch?v=LSc3uoZfNp8&feature=share
Comments
Post a Comment