-సౌందర్య లహరి! (శ్రీ శంకర భగవత్పాద విరచితము)

-

శుభం -సౌందర్య లహరి!

(శ్రీ శంకర భగవత్పాద విరచితము)

-

శ్లోకము (27)

జపో జల్పశ్శిల్పం సకలమపి ముద్రావిరచనా

గతిః ప్రాదక్షిణ్యక్రమణ మశనాద్యాహుతివిధిః,

ప్రణామస్సంవేశః సుఖమఖిల మాత్మార్పణదృశా

సపర్యాపర్యాయ స్తవ భవతుయన్మే విలసితమ్ !!

అమ్మా! భగవతీ! ఆత్మార్పణదృష్టితో నేను చేసే

సల్లాపం నీమంత్ర జపం గాను, నాహస్తవిన్యాస

మంతా ముద్రార చనగాను, నాస్వేచ్ఛాగమనం

నీకు గావించే ప్రదక్షిణగాను , నాభోజనాదులు ఆహుతిగాను, నాపరుండటం ప్రణామంగాను, 

సుఖకరమైన నేను గావించే చేష్టావిలాసమంతా

నీకు సమగ్రమై సంతోషదాయకమైన పూజ

అవుగాక !

(అలా అయ్యే టట్లు నువ్వు కరుణించు

తల్లీ అని భావం).

-

ఓం త్రిపురాయైనమః

ఓం త్రిగుణాంబికాయైనమః

ఓం పురుషార్థప్రదాయైనమః

--

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!