ఆస్తికులు-నాస్తికులు !

ఆస్తికులు-నాస్తికులు !

-

ఒక మిత్రుడు నన్నడిగాడు.ఆస్తికులు మంచివారా? నాస్తికులు మంచివారా? అని.


ఈ ప్రశ్న నన్ను ఆలోచింప చేసింది.


ఆస్తికత్వం, నాస్తికత్వం అనెవి మన నమ్మకాలకు చెందిన విషయాలు. కాని మంచితనం అలా కాదు. అది నమ్మకానికి సంబంధించిన విషయం కాదు. హృదయానికి సంబంధించిన విషయం.


ప్రపంచంలొ మహా భక్తులుగా చెలామణీ అవుతున్న వారిలో పెద్ద దొంగలు, దుర్మార్గులు చాలా మంది ఉన్నారు. అదే విధంగా మంచి వారూ చాలామంది ఉన్నారు. అలాగె నాస్తికులలో కూడాను. కనుక ఈ రెండూ భిన్న విషయాలు. పోల్చలెనివి.


ఒక మనిషి బాధలో ఉన్నపుడు స్పందించి ఆ బాధను తనదిగా భావించి సాయం చెయ్యటం మంచితనం. మానవత్వం. దీనికి కావలసింది స్పందించే హృదయం. అసలు, మనిషి ఆస్తికుడా నాస్తికుడా అనేది ప్రశ్నే కాదు. మనిషి మనిషి గా ఉన్నాడా లెదా అనేదే ప్రశ్న.


ఒక మనిషి గనక పరిపూర్ణ మానవత్వం తో ఉంటె, అతను నాస్తికుడైనా సరే, దెవునికి అతడే దగ్గర అవుతాడు. అదే స్వార్ధ పరుడైన ఆస్తికుడు ఎన్ని పూజలు చెసినా దెవునికి దగ్గర కాలేడు. కనుక మనిషి స్వార్ధ పరుడా, లెక నిస్వార్ధ పరుడా అనెదె ముఖ్యం కాని, అతడు దెవుని నమ్ముతున్నాడా లెదా అనెది ముఖ్యం కాదు.


ఈ స్వార్ధం లెకుండా మనిషి ఉండగలడా? జీవించాలంటె ఎంతో కొంత స్వార్ధం అవసరం. కాని మితిమీరిన స్వార్ధం అవసరం లెదు. తన కడుపు నిండిన తరువాత కూడా ఎదుటి వాడి కడుపు కొట్టాలనుకోవటం తప్పు. కాని తన కడుపు ఎప్పుడు నిండుతుందో, ఎంత తింటే నిండుతుందో కూడా తెలియని స్థితిలో మనిషి బతుకుతున్నాడు. కనుకనే మితిమీరిన స్వార్ధం తొ అన్నీ తనకె చెందాలనే తపనతో భ్రమతో ఎక్కడికి పొతున్నాడో తెలియని స్థితిలో సాగిపొతున్నాడు.


ఇటువంటి మనిషి దెవుని నమ్మినా నమ్మక పొయినా పెద్ద తెడా లెదు. మన రాజకీయ నాయకులు అందరూ దైవ భక్తులే. కాని ఉపయోగం ఎముంది? సమాజంలొ మోసగాళ్ళు అందరూ దైవ భక్తులే. ప్రయోజనం ఎముంది. ఇటువంటి భక్తిని దేవుడు మెచ్చడు. భక్తి కన్నా, నమ్మకాల కన్నా మానవత్వం ముఖ్యం.


ఎవరి హృదయం మానవత్వం తొ తొణికిసలాడుతూ ఎదుటి మనిషి బాధను తన బాధగా స్పందించగలిగే స్థాయికి చెరుకుంటుందో అట్టి వాని వద్దకు భగవంతుడే స్వయంగా వెతుక్కుంటూ వస్తాడు. మానవత్వం లెని ఆస్తికత్వం వ్యర్ధం. విలువలు లెని భక్తీ వ్యర్ధమే.


దురదృష్ట వశాత్తూ ప్రస్తుత సమాజంలో మానవత్వం, ఆస్తికత్వం భిన్న ధ్రువాల లాగా ఉన్నాయి. దెవుని విగ్రహాలలొనే కాదు సాటి మనిషిలో, సాటి జీవులలో చూడలేని వాడు ఆస్తికుడూ కాలేడు, భక్తుడూ కాలేడు. ఇదే మాట నా మిత్రునితో చెప్పాను. మీరేమంటారు?


-


నాస్తికుల వాదనను తిప్పికొట్టడానికి ఆస్తికులు ఉప్యోగించే ఒక ఆయుధం ఈ వాదన:"నాస్తికత్వం కూడా ఒక నమ్మకమే! దేవుడు ఉన్నాడని మేమెలా నమ్ముతామో, లేదని మీరు అలాగే నమ్ముతారు" అని. మరి ఈ వాదనలో నిజం ఉందా?


నాస్తికులు దేవుడు లేడు అని నమ్మరు. కేవలం వారు దేవుడు అనే ఒక నమ్మకం కలిగిఉండరు. ఏ నమ్మకమూ లేకపోవడమూ కూడా ఒక నమ్మకమే అవుతుందా? ఇది చిన్నప్పుడు మనం చదువుకున్న మౌల్వీ నసీరుద్దిన్ జోకు లాంటి వాదన. ఏ కారూ లేని వాడి దగ్గరకి వెళ్ళి నువ్వు నోకార్ (no car)కలిగి ఉన్నావు, రోడ్డు టాక్సు చెల్లించాల్సిందే అన్నట్లు.


లేనిదానిని నిరూపించడం అసాధ్యం అవుతుంది. ఎప్పుడైనా నిరూపించాల్సిన భాద్యత ఉన్నదని క్లెయిము చేసే వారిదే. దీనికి బెర్‌ట్రాండ్ రస్సెల్ ఇలా చెప్పాడు: నేను ఆకాశంలో శుక్రుడికీ, గురుడికీ మధ్యన ఒక టీ కప్పు తిరుగుతుంది అని చెప్పితే ఎవరైనా ఆకాశం అంతా తిరిగి ఆ టీ కప్పు లేదు అని నిరూపించగలరా? కాబట్టి దేవుడు లేడు అని నిరూపించమని నాస్తికులను అడగడం సరి అయిన వాదన కాదు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!