తులసి ఆకు.!

తులసి ఆకు.!

ఆకుల మధ్య తమలో ఎవరు గొప్ప అన్న వాదన మొదలైంది. 

"నేను అన్నిటికన్నా శుభప్రదం. మoగళానికి నేనే చిహ్నం. మిగతా ఆకులన్నీ అమoగళం" అంది మామిడాకు.

అప్పట్నుంచీ మామిడాకులు తలకిందులుగా వేలాడుతున్నాయి. 

"నేను సువాసనలకు, పరిమళాలకూ మారుపేరు. మీకు వాసనలేదు. మీరెందుకూ పనికిరారు" అంది కరివేపాకు.

కరివేపాకులు కూరలో తప్పనిసరి. కానీ వంట పూర్తయ్యాక పక్కన తీసి పారేస్తారు. అప్పట్నుంచీ అవి కూరలో కరివేపాకులయ్యాయి.

"అన్నం తినేందుకు నేనే పనికొస్తాను. మీరంతా వేస్టు" అంటూ నీలిగింది అరిటాకు. 

అప్పట్నుంచీ అరటాకు అన్నం తినేశాక చెత్తకుండీలోకి చేరింది. చెత్తకుండీలో దుర్భరమైన కంపు మధ్య బతకాల్సి వచ్చింది.

"అసలు గొప్పంతా నాదే. అన్నం తిన్నాక ముఖశుద్ధికోసం అంతా నన్నే తింటారు" అని హొయలు పోయింది తమలపాకు.

అప్పట్నుంచీ మొత్తం నమిలేశాక మనిషి దాన్ని బయటకు ఉమ్మేయడం మొదలుపెట్టాడు.

పాపం... తులసి ఆకు.... ఏమీ అనలేదు. తన గొప్ప చెప్పుకోలేదు. 

అందుకే దాన్ని పూజిస్తారు. తులసమ్మ అని పిలుస్తారు

.

గోవర్ధనమంత పర్వతాన్ని ఎత్తిన వాడిని తులాభారంలో తేలిపోయేలా చేసేందుకు ఒక్క తులసిదళం చాలు. అంతెందుకు...? 

అంత్య ఘడియల్లో తులసి తీర్థం నోట్లో పోస్తే వైకుoఠమే సoప్రాప్తిస్తుoది.

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.