ఏలే ఏలే మరదాలా.!


ఏలే ఏలే మరదాలా.!

.

బావా మరదళ్ళ సరస సల్లాపాల యుగళ గీతం!

(అచ్చ తెలుగు పదాల అందమైన పొందికలో 

జానపదుల గుండెల్ని 

పరవశింపచేసే రీతిలో ... 

రచన చేసిన ... అన్నమయ్య కి జోహార్లు )

.

ఏలే ఏలే మరదలా

చాలు చాలు చాలును

చాలు నీతోడి సరసాలు బావ

గాటపు గుబ్బలు కదలగ కులికేవు

మాటల తేటల మరదలా

చీటికి మాటికి చెనకేవు వట్టి

బూటకాలు మాని పోవే బావ

అందిందె నన్ను అదిలించి వేసేవు

మందమేలపు మరదలా

సందుకో తిరిగేవు సటకారి ఓ బావ

పొందుకాదిక పోవే బావా

చొక్కపు గిలిగింత చూపుల నన్ను

మక్కువ సేసిన మరదలా 

గక్కున నను వేంకటపతి కూడితి

దక్కించుకొంటివి తగువైతి బావ

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.