శాస్త్రీయ గీతాల వసంతం.... ఎమ్‌.ఎల్‌.వసంతకుమారి.

ఎమ్‌.ఎల్‌.వసంతకుమారి అనే గాయని ఒకరు ఉన్నారని చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఆమె తెలుగు సినిమాల్లో పాడిన పాటలు చాలా తక్కువ. పాడిన కొద్ది పాటలు కూడా ఎప్పుడో 1950లలో, అది కూడా పూర్తిగా కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఉంటాయి. అందుకే ఈమెని గుర్తుపెట్టుకునేవారు బహు తక్కువ. ఆమె పూర్తిపేరు మద్రాసు లలితాంగి వసంత కుమారి. కర్ణాటక సంగీతంలో ఆవిడకు ఎమ్‌.ఎస్‌.సుబ్బులక్ష్మికి ఉన్నంత పేరుంది. ఎమ్‌.ఎస్‌.సుబ్బులక్ష్మి, డి.కె.పట్టమ్మాళ్‌ ఆమెకు సమకాలీనులు. ప్రముఖ నటి శ్రీవిద్య వసంతకుమారి కూతురు. 

ఎమ్‌.ఎల్‌.వసంతకుమారి తన గాత్రంతో శ్రోతలను ఆకాశ వీధుల్లో విహరింపజేయగలరు. అదే ఆలాపనలతో కంటనీరు పెట్టించగలరు. 

వసంత కుమారి ఇంటి పేరు ఎమ్‌.ఎల్‌గా సిర్థపడటం వెనుక ఒక తమాషా అయిన కథ ఉంది. సాధారణంగా పిల్లలకు తండ్రి ఇంటిపేరు వస్తుంది. తమిళులకి ఇంటి పేరు వుండదు కాబట్టి తండ్రి పేరునే ఇంటిపేరుగా పెట్టుకుంటారు. వసంత కుమారి తండ్రి అయ్యస్వామి అయ్యర్‌, మద్రాసు లలితాంగి అనే ఒక దేవదాసీ కుటుంబంలోని యువతిని పెళ్ళాడారు. 

ఒకసారి మద్రాసు లలితాంగి సంగీత కచేరీ చేయాల్సిన సమయంలో ఉబ్బసంతో ఆరోగ్యం బాగాలేక కచేరీ చేయలేకపోయారు. ఆ సమయంలో కచేరీకి వచ్చిన ప్రేక్షకులను నిరాశపరచడం ఇష్టంలేక పదమూడేళ్ళ వసంత కుమారిని 'మద్రాసు లలితాంగి వసంతకుమారి' కచేరీ చేస్తుందని అప్పటికప్పుడు ప్రకటించారు. అలా అప్పటి నుండి ఆమెకు ఆ పేరు స్థిరపడిపోయింది. 

సంగీత వృత్తిలో జీవనానికి సరిపడే ఆదాయం ఉండదని వసంతకుమారిని పెద్ద చదువులు చదివించి డాక్టర్‌ని చేయాలనుకున్నారు ఆమె తల్లిదండ్రులు. కానీ ఆమె మాత్రం సంగీత ప్రపంచంలోనే ఉండిపోయారు. ఆ రోజుల్లో పాటలు పాడగలిగిన తారలకు చిత్రప్రపంచం ప్రముఖస్థానం కల్పించేది. అలా వసంతకుమారి సినిమాల్లో నటిస్తూనే పాటలు పాడారు. 

ఆమె సంగీత కచేరీలన్నీ తల్లి మద్రాసు లలితాంగే పర్యవేక్షించేవారు. తల్లి మరణంతో కచేరీలకు ఎలా డబ్బులు తీసుకోవాలో, ఆదాయ వ్యయాలు ఎలా అంచనా వేయాలో అర్థమయ్యేది కాదు. ఆమె దగ్గరకు ఎవరైనా ఇబ్బందుల్లో వున్నామంటూ వస్తే వెంటనే ఆదుకునేవారు. అలా ఆమెకొచ్చే ఆదాయం కంటే ఖర్చులు పెరిగిపోయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని, చివరికి సొంత ఇల్లు అమ్ముకుని అద్దె ఇంట్లోకి చేరారు. 

కూతురు శ్రీవిద్య తనకు ఇష్టంలేని సినీరంగంలో అడుగు పెట్టడం, ఆమె పెళ్ళి విఫలమవడం వంటి విషయాలు వసంతకుమారిని మరింత బాధపెట్టాయి. ఆ ప్రభావం ఆమె గొంతుపై పడి కచేరీలు చేయలేకపోయారు. అదే సమయంలో తత్వవేత్త జిడ్డుకృష్ణమూర్తి మదనపల్లిలో పెట్టిన రిషీవ్యాలీ స్కూల్లో చేరి విద్యార్థులకు సంగీత పాఠాలు నేర్పించారు. అక్కడ ఉద్యోగ విరమణ చేసిన తర్వాత తిరిగి మద్రాసు చేరారు. ఆరోగ్యం బాగాలేకపోయినా, ఆనవాయితీ ప్రకారం క్రిస్‌మస్‌రోజు మద్రాసు కృష్ణగానసభలో కచేరీ చేసి తిరిగి ఆసుపత్రికి వెళ్ళారు. క్యాన్సర్‌ వ్యాధి మూలంగా ఆసుపత్రిలోనే ఎక్కువ రోజులు వుండాల్సి వచ్చింది. ఆమె అభిమాని అయిన ఒక డాక్టర్‌ ఆసుపత్రి బిల్లు భరించాడు. ఎందరో అభిమానులు సేవలు చేశారు. అటువంటి సమయంలో కూడా కూతురు పెళ్ళికి సహాయం చేయమని అడిగిన ఒక వ్యక్తికి తన మెడలోని ఆఖరి గొలుసు తీసి ఇచ్చిన జాలి గుణం ఆమెది. 

సంగీత ప్రపంచంలో అతి చిన్న వయసులోనే ఎన్నో అవార్డులను అందుకున్నారు. కేవలం ముప్పైతొమ్మిదేళ్ళ వయసులోనే పద్మభూషణ్‌ అవార్డును అందుకున్నారు. వ్యక్తిగత జీవితం ఎంత ఇబ్బంది పాలైనా, తనకున్న సంగీత పరిజ్ఞానం పదిమందికి పంచాలనుకున్న సంగీత కళాకారిణి వసంతకుమారి. 

1958లో విడుదలైన భూకైలాస్‌ చిత్రంలో ఆమె పాడిన ''మున్నీట పవళించు నాగశయనా'' పాట తెలుగులోనే కాకుండా ఆమె పాడిన పాటల్లో అత్యుత్తమమైనది. 'మాయాబజార్‌' (1957) చిత్రంలో ఆమె పాడిన ''శ్రీకరులు దేవతలు శ్రీరస్తులనగా'' పాట కూడా బాగా పేరుపొందింది.

'జయభేరి'లో ''నీవెంత నెరజాణవేరా సుకుమారా'', 'సతీ అనసూయ'లో ''మారు పల్కవదేమిరా నాతో'', 'వరుడు కావాలి'లో ''నమ్మించి మరిరాడే నందసుతుడు'', 'భలే అమ్మాయిలు'లో ''గోపాల జాగేలరా నను లాలించి పాలింప రావేలరా'', 'నలదమయంతి'లో ''జాలి చూపవదేలరా ఈ బాల తాళలేదు'', 'మాయాబజార్‌'లో ''వర్థిల్లు మా తల్లి వర్థిల్లవమ్మా''.... వంటి పాటలన్నీ అలనాటి ప్రేక్షకులను, సంగీతాభిమానులను అలరించినవే. 

ఆమె పాడితే జోరున జడివాన కురుస్తున్నట్టుంటుంది. రసాల ఫలం పక్వమై రసం ఎగజిమ్ముతున్నట్టుంటుంది. రత్నాలని కుప్పగా పోస్తే ధగధగమంటున్నట్టు ఉంటుంది. మాధుర్యపు వినువీధిలో సంచరిస్తున్నట్టుంటుంది. ఆ గ్రాతం అప్రయత్నంగా, అనాయాసంగా మెలికలు తిరిగి సమ్మోహన పరుస్తుంది. ఏ కీర్తన ఎంచుకొని పాడినా ఇదివరకెప్పుడూ వినని మంత్రముగ్ధమైన, శ్రావ్యమైన గాత్రమది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!