నమిలి మింగిన నా యెంకి” !

"
నమిలి మింగిన నా యెంకి” !

.

"నమిలి మింగిన నా యెంకి” ఎంకి నాయుడుబావల ప్రణయానికి, ప్రేమకు పరాకాష్ఠ. 

దీనిలో వున్న భావనా సంపద, స్వభావాలను మాటల పొందిక, పొదుపుల ద్వారా రూపొందించటం, వర్ణ చిత్రాలు ప్రత్యేకం, కాలాతీతం. స్వానుభవం, సార్వజనీనం;

రెండింటి ఏకత్వానికి ఎంకి నాయుడుబావలు ఒక సంకేతం.

.

యెంకి వొంటి పిల్ల లేదోయి లేదోయి!

యెంకి నా వొంకింక రాదోయీ రాదోయీ !

.

మెళ్ళో పూసలపేరు

తల్లో పూవుల సేరు

కళ్ళెత్తితే సాలు

కనకాబిసేకాలు

యెంకి వొంటి పిల్ల లేదోయి…

.

సెక్కిట సిన్నీమచ్చ

సెపితే సాలదు లచ్చ !

వొక్క నవ్వే యేలు

వొజ్జిర వొయిడూరాలు !

….

రాసోరింటికైన

రంగు తెచ్చే పిల్ల

నా సొమ్ము – నా గుండె

నమిలి మింగిన పిల్ల

……………..

ఇటువంటి గేయాలు ప్రణయ మాధుర్య, ఆత్మశక్తి సంపన్న గేయాలు,

ఇక్కడ కవి (లేక నాయుడుబావ) ఉదహరించినవి కేవలం పదాలు, అలంకారాలు కావు. పదాన్ని సందర్భవశం చెయ్యటం. వాస్తవం, అనుభవం, ఊహ, జానపదం, భక్తి, వేదాంతం ఒకటిగా రూపొందుతయ్. తెలుగుతనం

, ప్రకృతి సౌందర్యం, సాంస్కృతిక ఆవరణ (cultural ambiance), ముగ్ధ మనోహర లక్షణం అనుభవానికి వస్తుంది. ఇలాంటి అనుభవానికి ఎంకి పాటలు చదివినప్పుడు తెలుగు సినిమా “మూగ మనసులు” జ్ఞాపకం వస్తుంది:

.

“మూగ మనసులు” సినిమా చూసినప్పుడు ఎంకి పాటలు గుండెలో, మనసులో మెదుల్తయ్.

“పాట” నే పాడంగ

గోడ సాటున యెంకి గుటక వేసే యేళ

సూడాలి నా యెంకి సూపుల యేళ!

సూడాలి నా యెంకి సోద్దెమా యేళ!

మూడు రకాల కన్నులుంటాయంటారు కవులు, తాత్త్వికులు –

భౌతిక, మానసిక, ఆత్మిక. ఒకదానికంటె యింకొకటి లోతుగా వుంటుంది,

చూపుగాని, అందం గాని. నాయుడుబావకు కలిగిన పారవశ్యం, ఎంకిని చూసినపుడు,

ఎంకి చూపుల ద్వారా కలిగిన పారవశ్యం. ఆ అనుభూతిని కవి కళ్ళకు కట్టినట్లు, ముగ్ధ మనోహరంగా వర్ణిస్తాడు.

స్నిగ్ధంగా, స్వచ్చందంగా, ఎంకిచూపు, నాయుడుబావ చూపు

, కవి చూపు ఒకటవుతయ్. చూపంటే అది. పట్నవాసులకు పల్లెటూరి పిల్లలన్నా

, వాళ్ళ అందచందాలన్నా, పద్ధతులన్నా చిన్న చూపు వుండవచ్చు. అటువంటి దృక్పథాలపై కవి హృదయపూర్వక విమర్శ చేస్తున్నాడు.

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!