భాగవతము -- పోతన-ప్రహల్లాదుడు .!

భాగవతము -- పోతన-ప్రహల్లాదుడు .!

"మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు పోవునే? మదనములకు 

నిర్మల మందాకినీ వీచికల దూగు రాయంచ చనునే ? తరంగిణులకు 

లలితా రసాల పల్లవ ఖాదియైచోక్కు కోయిల సేరునే? కుటజములకు 

బూర్నేందు చంద్రికా స్పురిత చకోరకమ్మరుగునే? సాంద్రనీహారములకు "

.

"అంబుజోదర దివ్య పాదారవింద 

చింతనా మృత పాన విశేషమత్త 

చిత్త మేరీతి నితరంబు జేరనేర్తు?

వినుత గుణసీల ! మాటలు వేయునేల ?"

.

ప్రహల్లాదునికి ఈ హరి భక్తీ గువులే నేర్పుచున్నారనే అనుమానం తండ్రికి కలిగింది. 

ప్రతీ వ్యక్తికీ సంస్కారాన్ని బట్టి మనసు మార్గం అబ్బుతాయి .

భగవంతుడే తప్ప మరో ఆలోచన లేని మనస్సుకి ఇంకొకరు చెప్పడం వినడం ఉండదని., పోతన అభిప్రాయం .అతనూ ఆకోవకు చెడిన వాడే కదా !

తన అభిప్రాయాని భక్తుడయిన బాలకుని చే చెప్పించాడు.వృద్యంగా తను చెప్పదలచుకున్నది . ఒకరడిన ప్రశ్నకు సమాధానంగా ప్రశ్నలే గుప్పించడం 

ఇందులోని విశేషం . ఈ పద్య భక్తికిపట్టుకొమ్మ . అర్ధం చెబుతాను. 

మందార పువ్వుల తేనెల మాధుర్యానికి అలవాటు పడ్డ తుమ్మెద ఉమ్మేత్తు 

చెట్ల వైపుకు పోవునా? స్వచ్చమయిన నిర్మల మయిన గంగానదిలో తేలియాడు

రాజ హంసలు వాగులకు వంకలకు పోవునా ? లేత మామిడి చిగుళ్ళు ఆరగించు కోయిలలు .కొండ మల్లెలు మ్రింగునా ? నిండు పున్నమిలో విహరించు చకోర పక్షులు పొగమంచు దరికి చేరునా ? అలా చేయవు. 

ఈ చెప్పు విధానం క్రొత్తది కాదు .పోతనకు ముందువాడు ఆ ప్రాంతము వాడు అయిన పాల్కురికి సోమన్న అంతకు ముందే చాలా ప్రయోగాలు చేసాడు. ఆ ప్రాంతం వాడయిన పోతనుకు ఆ వాసన అబ్బినది . 

పద్మనాభుని నిత్యమూ ద్యానించు నా చిత్తము ఇతర విషయముల వైపుకు పోవునా ? ఇది ఒక ఉపన్యాసకుడు వేదికనెక్కి గట్టిగా వాదించు ఫక్కి . ఇది పోతనకు చాలా ప్రితిపాత్రమయిన బాణీ . 

ఈ తరహాలో చాలా పద్యాలు భాగవతం నిండా గుప్పించాడు ఈ రాచనా ప్రక్రియ సోమన్నకు పోతన్నకు ప్రత్యేకము .ఆ హక్కులు వారిద్దరివే .

ఇది బహుళ ప్రచారం పొంది పద్యం. తెలుగు నాట ఈ పద్యంలో ఒక పాదమయినా రాని స్త్రీ పురుషులు ఉండరనుటలో అతిశయోక్తి లేదు . ..

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!