సుమతి శతకం .! (దుర్మార్గుడు.) .

సుమతి శతకం .!
(దుర్మార్గుడు.)
.
పాలను గలసిన జలమును
బాల విధంబుననే యుండుం బరికింపంగాఁ
బాల చవిఁ జెఱచుఁ గావున
బాలసుడగు వాని పొందు వలదుర సుమతీ !
.
ఓ సుమతీ ! పాలలో కలిసిన నీరు పాల వలే కన్పిస్తాయి కాని కాని పరిశీలించి చూస్తే పాల రుచిని చెడగొట్టినట్లు మనం గమనించగలం. అలాగే దుర్మార్గుని తో స్నేహం మన కున్న గౌరవాన్ని కూడ పోగొడుతుంది కాబట్టి చెడ్డవాని తో స్నేహం చేయకూడదు.
.
పాలసున కైన యాపద
జాలింబడి తీర్ప దగదు సర్వజ్ఞునకున్
దేలగ్నిఁ బడగఁ బట్టిన
మేలెఱుగునె మీటు గాక మేదిని సుమతీ !
.
ఓ సుమతీ ! ఒక దుర్మార్గునికి ఆపద సంభవిస్తే చూచిన బుద్ధిమంతుడైన వాడెవడూ కూడ వానిని చూసి జాలిపడి ఆదుకోకూడదు. వాని ఆపద గడవడానికి మనం సహాయం చేయకూడదు. ఎందుకంటే తేలు నిప్పులో పడితే చూసిన మనం దానిని కాపాడు దామని పట్టుకున్నామనుకోండి. అది మనల్ని కుట్టకుండా ఊరుకోదు గదా. అదే విధంగా దుర్మార్గుని ప్రవర్తనా ఉంటుందని తెలుసుకోవాలి.x

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.