🙏శ్రీ గురజాడ అప్పరావు గారు🙏


🌹మన సాహితీ ప్రముఖులు (19)🌹


🙏శ్రీ గురజాడ అప్పరావు గారు🙏


👉దేశమును ప్రేమించుమన్నా

మంచి అన్నది పెంచుమన్నా

వొట్టి మాటలు కట్టిపెట్టవోయ్

గట్టిమేల్‌ తలపెట్టవోయ్‌

పాడి పంటలు పొంగిపొరలే దారిలో


నువ్వు పాటు పడవోయ్


తిండి కలిగితే కండకలదోయ్


కండకలవాడేను మనిషోయ్


“పొగ త్రాగని వాడు దున్నపోతై పుట్టును…”

ఈ మాటలన్న గిరీశం అంటే తెలియని వాళ్ళు బహుశా

తెలుగునాట ఉండరేమో… అలంటి అద్భుత పాత్రని సృష్టించిన గురజాడ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.


ప్రముఖ రచయిత. గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు, హేతువాది. 19 వ శతాబ్దంలోను, 20 వ శతాబ్ది మొదటి దశకంలోనూ ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. గానూ భావించే ఆ రోజుల్లో ఆయన ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో రచనలు చేసారు. వీరి కన్యాశుల్కము నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు మొదలైన పాత్రలు ప్రఖ్యాతి పొందాయి. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన అప్పారావు, తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడు. ఆయనకు కవి శేఖర అనే బిరుదు కూడా ఉంది.


పుత్తడి బొమ్మా పూర్ణమ్మా అనే సుప్రసిద్ధ గేయం ఆయన రచనల్లో మరొకటి. దీని ఇతివృత్తం కూడా కన్యాశుల్కము దురాచారమే. కరుణ రసాత్మకమైన ఈ గేయ కావ్యంలోని చివరి పద్యం ఇది:


కన్నుల కాంతులు కలువల చేరెను

మేలిమి జేరెను మేని పసల్‌

హంసల జేరెను నడకల బెడగులు

దుర్గను జేరెను పూర్ణమ్మ

పుత్తడి బొమ్మా పూర్ణమ్మా


గురజాడ అప్పారావు విశాఖ జిల్లా, రాయవరం (ఎలమంచిలి) లో, మేనమామ ఇంట్లో 1862 సెప్టెంబరు 21 న, వెంకట రామదాసు, కౌసల్యమ్మ దంపతులకు జన్మించారు.

తన పదవ ఏట వరకు అప్పారావు చీపురుపల్లిలో చదువుకున్నారు. తర్వాత, వారి తండ్రి కాలం చెయ్యటంతో, విజయనగరానికి వచ్చారు. ఇక్కడ చాల పేదరికంలో వారాలు చేసుకుంటూ చదువు కొనసాగించారు. ఈ సమయంలో అప్పటి ఎమ్. ఆర్. కాలేజి ప్రిన్సిపాల్ సి. చంద్రశేఖర శాస్త్రి ఈయనను చేరదీసి ఉండడానికి చోటిచ్చారు. 1882 లో మెట్రిక్యులేషను పూర్తిచేసి, తర్వాత 1884 లో ఎఫ్. ఎ చేసారు. ఇదే సంవత్సరంలో ఏం. ఆర్. హై స్కూలులో టీచరుగా చేరారు

1897లో మహారాజా ఆనంద గజపతి చిన్న వ్యాధితో కాలం చేసినప్పుడు, రీవా మహారాణి, అప్పల కొండమాంబ గారికి వ్యక్తిగత కార్యదర్శిగా అప్పారావు నియమితు డయ్యారు. 1884లో మహారాజా కాలేజి వారి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరారు. 1886లో డిప్యూటీ కలెక్టరు ఆఫీసులో హెడ్‌ క్లర్కు పదవినీ, 1887లో కళాశాలలో అధ్యాపక పదవినీ నిర్వహించారు. 1886లో రాజా వారి ఆస్థానంలో చేరారు. 1911లో మద్రాసు యూనివర్సిటీ బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌లో సభ్యత్వం లభించింది.

1913 లో అప్పారావు పదవీ విరమణ చేసారు. అప్పటినుండి అనారోగ్యంతో బాధపడేవారు. ఇదే సమయంలో మద్రాస్ విశ్వవిద్యాలయం వారు "ఫెలో"తో గౌరవించారు. చివరికి, 53 సంవత్సరాల వయసులో 1915 నవంబర్ 30 న గురజాడ అప్పారావు మరణించారు.


🌹🙏 చిత్రం - పద్మ కృష్ణ గారు.🙏🌹


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!