కృతజ్ఞతాగేయం!


కృతజ్ఞతాగేయం

అహ్మదాబాద్ స్టేషన్ డెరైక్టర్‌గా రజనీకాంతరావు (1970

.

నే చేయునదీ నే చేయనిదీ

సాధించినదీ ఫలియించనిదీ

నీ యిచ్ఛలేక జరుగదట

నా స్వేచ్ఛ మొదలు తుది యెచట! ॥చేయునదీ॥

.

నిను చూచుటకే రప్పించితివీ

నీ దరిసెనమే యిప్పించితివీ

యీనోట పాట పాడించితివీ

యిది ఎవరి రచనయని యడిగితివీ ॥చేయునదీ॥

.

నా భావనమే నా జీవనమై

నీ ప్రణయమ్మే నా కవనమ్మై

నా అహపుటంచు చెరిపించెదవో

నా ఇహము పరము గావించెదవో ॥చేయునదీ॥

.

నాదామృతమే పరసాధనగా

నీ దివ్య వాక్కే ఉద్బోధనగా

ఈ రజని కాంతు లొలయించెదవో

విశ్వ జనహితము వెలయించెదవో ॥చేయునదీ॥

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!