వాగ్విలాసము.! (భర్తృహరి వైరాగ్యశతకము )

వాగ్విలాసము.!

(భర్తృహరి వైరాగ్యశతకము )

ఆకలి ..ఎంత పని ఆయెన చేస్తుంది.

.

"భ్రాన్తం దేశమనేకదుర్గవిషమం ప్రాప్తం న కిఞ్చిత్ఫలం

త్యక్త్వా జాతికులాభిమానముచితం సేవా కృతా నిష్ఫలా।

భుక్తం మానవివర్జితం పరగృహేష్వాశఙ్కయా కాకవత్

తృష్ణే జృమ్భసి పాపకర్మనిరతే నాద్యాపి సంతుష్యసి॥ 

.

ఆంధ్రీకరణ...ప్రచురించినది : రాఘవ 

.

"విసికితి దుర్గదుర్విషయవిభ్రమయుక్తిఁ గులాభిమానమున్

బసచెడ సేవ చేసితి విపన్నుఁడనై పరగేహసీమ వా।

యసము వలెన్ భుజించితిఁ బ్రయత్నము నిష్ఫలమై నశించె సం

తసపడ వుగ్రకర్మపిశునత్వము చూపెద వాశ యేటికిన్॥

.

తా. దుస్సంచారములైన ప్రదేశాలలో దేశాటన చేసాను కానీ ఫలితం శూన్యం. జాత్యభిమానం కులాభిమానం వదిలి నిరుపయోగంగా (

ధనికులు మొదలైనవారికి) సేవ చేసాను. (ఆపదలో) బెదురుతూనే ఇతరుల ఇళ్ళలో గౌరవంలేకున్నా కాకిలా భోజనం చేసాను. 

ఇన్ని కష్టాలు పడినా ఓ పాపిష్ఠపు తృష్ణా, ఇప్పటికీ తృప్తి కలగడం లేదు. 

నీవు ఇంకా ఇంకా పెరుగుతూనే విజృంభిస్తూనే ఉన్నావు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!