అది శివ ధనుస్సు భంగం కాదు!

అది శివ ధనుస్సు భంగం కాదు అది మదించిన
రావణ మత్తేభ మద మణ చిన భంగిమ !
.
మదించిన నల్లని ఏనుగు తన బలమైన తొండముతో
పెద్ద మర్రి కొమ్మను పట్టి ఫళ ఫళ విరచినట్టు
అరి వీర భయంకరుడు అయిన ఈ రాముడు
తన బలమైన బాహువులతో
శివ ధనుస్సు ఎత్తి పెళ పెళ విరచి పడేశాడు.
ఎత్తిన ధనువు ఎత్తినట్లే పెటిల్లున రెండు ముక్కలు కాగ తటిల్లున
విద్యుత్ కాంతి లతికలా తటాలున సీతా నా ముక్కాలా నడుమ దోచెను విధ్యుల్లతికలా .
.
ఆ శివ ధనుస్సు భంగం
పరులకు ధరులకు ఉరుములు మెరుపులు కాగా ,
వధూవరులకు ఊర్పుల వలపుల మెరపులై తోచే .
అది శివ ధనుస్సు భంగం కాదు అది మదించిన
రావణ మత్తేభ మద మణ చిన భంగిమx

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!