‘శ్రీ శాంత దుర్గాదేవి’

శివకేశవులు ఒకానొక సందర్భమందు వాగ్యుద్ధం చేస్తుండగా అమ్మవారు ‘శ్రీ శాంత దుర్గాదేవి’గా అవతరించి వారిరువురిని శాంతింపజేసిందట.
అమ్మవారి హస్తములయందు రెండు సర్పములు కలవు. వాటిని శివ, కేశవులుగా భావిస్తారు.
క్రింద శివలింగము నేర్పరచి అమ్మవారితో బాటు శివునికి కూడా అభిషేకోపచారములతో పూజలు చేస్తారు.
శాంతడుర్గా అమ్మవారిని ‘సంతేరి’ అమ్మవారుగా కూడా పిలుచుకుంటారు. కొందరు గోవా బ్రాహ్మణులు, భండారీలు కులదేవతగా ఆరాధిస్తారు.పోర్చుగీసువారి ఆందోళనలతో 1564లో సష్ఠిప్రాంతం నుండి అమ్మవారి విగ్రహం ‘కావాలం’ అనే గ్రామానికి తరలించి ఒక పర్వత ప్రాంతమున ప్రతిష్టించబడింది. ఛత్రపతి శివాజీ పాలనా సమయమున 1739 సం.లో దేవాలయం నిర్మించబడింది. 1966 సం.లో పునరుద్దరింపబడినది. ఈ దేవాలయం చాలా పెద్దది. అందమైనదిగానూ కొనియాడబడుతోంది.
శాంత దుర్గాదేవియే గాక లక్ష్మీ నారాయణుడి విగ్రహం కూడా ఈ దేవాలయమందు ప్రతిష్టింపబడి ఉన్నది.
విదేశీయులకు ప్రవేశం నిషిద్ధం. దుర్గా నవరాత్రులలోనూ, ముఖ్యమైన పండుగ దినములలోను విశేష పూజలు జరిపి అమ్మారిని బంగారు పల్లకిలో ఊరేగిస్తారు.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!