పోతన - శ్రీమద్భాగవతం.!

పోతన - శ్రీమద్భాగవతం.!

.

నీ దిక్కు గానివారికి

నే దిక్కును లేదు వెదక నిహపరములకున్

మోదింపదలచువారికి

నీ దిక్కే దిక్కు సుమ్ము! నీరజనాభా!

(పద విభాగం: నీ, దిక్కు, కానివారికిన్, ఏ దిక్కును, లేదు, వెదకన్, ఇహ, పరములకున్, 

.

మోదింపన్, దలచువారికి, నీ, దిక్కే, దిక్కు, సుమ్ము, నీరజనాభా!)

‘ఓ పద్మనాభా (నాభిలో పద్మం కలిగి ఉన్న విష్ణుమూర్తి)!

.

నువ్వే ఆధారం (దిక్కు) అనుకోనివారికి ఎంత వెతికినా శరణు (దిక్కు) ఉండదు. 

.

ఈ లోకంలో, పరలోకంలో ఆనందంగా ఉండాలనుకునేవారికి నువ్వే ఆధారం,’

.

అని రామావతారాన్ని స్తుతించారు,పోతన గారు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!