కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !
శ్రీ కృష్ణ స్తోత్రము . శ్లో !! కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ ! నాసాగ్రే నవమౌక్తికం కర తలే వేణుం కరే కంకణమ్ ! సర్వాంగే హరి చందనం చ కలియన్ కంఠే చ ముక్తావళి ! గోప స్త్రీ పరివేష్టి తో వవిజయతే గోపాల చూడామణీః !! తా. లలాటమున కస్తూరీ తిలకము దిద్దుకొన్న వాడును , వక్షః స్థలమున కౌస్తుభ మణిని ధరించిన వాడును , ముక్కునకు బులాకీగా మంచి ముత్యమును ధరించిన వాడును , చేతుల లో వేణువు గలవాడును , చేతులకు కంకణములు ధరించిన వాడును , దేహమందతటను హరిచందనము పూయ బడిన వాడును , కంఠమునందుముత్యాల హారమును ధరించిన వాడును , గోపికా స్త్రీలతో పరివేష్టింపబడి యున్నవాడును , అగు గోపాల చూడామణి అయిన శ్రీ కృష్ణుడు విజయమునుపొందు గాక !!
.jpg)
మ.
ReplyDeleteఒక వంకన్ ప్రియు జూచి నవ్వు రిపు నింకో వంక క్రోధోద్రిక్తయై
వికటాడంబర హాసమున్ గనుచు సంవేద్యంబుగా నొప్పుచున్
సుకుమారాంగ నటునిటున్ సుశ్రీకుపై వైరిపై
యకళంకోజ్వల మన్మథాస్త్రములు సంహారాస్త్రముల్ వేసెడిన్.
( ఇది నా పద్యం. చూడండి
పోతన, సోమన లంత గొప్పగా చెప్పలేకపోయినా నాదీ ఓ ప్రయత్నం.)
మంచి ప్రయత్నం. చాలా బాగుంది. నాచన సోముడు వ్రాసినంత అందంగానే వ్రాసారు.
DeleteReally I missed this poem till today.
Delete