మారని లోకం తీరు !

మారని లోకం తీరు !

-

ఏంటి రాధా ఇవాళ చాలా హుషారుగా కనిపిస్తున్నావ్.... ! 

మీ శ్రీవారు సినిమా ప్రోగ్రాం పెట్టారేంటి.......?"

పక్కింటి సుధ నవ్వుతూ అడిగింది.

"సినిమానా..... చింతకాయలూనా...... ! నాకంత సీను లేదులే తల్లీ..... ! పెళ్ళయి పదేళ్ళు అవుతుంది. ఓ సినిమా...... షికారూ నేనెరగను....! ఆయనికి షికార్లూ గికార్లూ గిట్టవ్.... ఒట్టి పాతకాలపు మనిషి. ఈనాటి మగాళ్ళకుండాల్సిన టేస్ట్ లు ఒక్కటీ లేవు. ఎరక్కపోయి కట్టుకున్నా.... ఈ అడవి మనిషిని .... !" అంది రాధ.


ఒకటి అడిగితే... తన భర్త గురించి నాలుగు చెప్పిన రాధ వంక వింతగా చూసింది సుధ.

*** *** *** ***

శరత్ తన స్నేహితులను ఇంటికి ఆహ్వానించాడు.

అందరూ హాల్లో కూర్చొని కబుర్లాడుకొంటుంటే.... శరత్ భార్య అనిత స్వీట్స్, ఫ్రూట్స్ తెచ్చి టీపాయ్ మీద పెట్టింది.

మైసూర్ పాకుని తలా ఓ ముక్క తీసుకొని తింటూవుండగా...... "ఏంటోయ్...... ! ఇది మైసుర్ పాకా... నీ తలకాయా... ! 

నమ్మలేక పోతున్నాను...." వ్యంగ్యంగా అన్నాడు శరత్.


అనిత నొచ్చుకొంటూ... "మరీ అంత గట్టిగా లేవులెండి..." అంది.


"నేను ముందే చెప్పా కదే.... నీ ముఖానికి స్వీట్స్ చేయటం రాదు కదాని. మా ఫ్రెండ్స్ వస్తారు నీ చేతగాని ప్రయోగాలు చేయక.... స్వీట్ స్టాల్ కెళ్ళి తెచ్చిపెట్టు.. అని ఫోన్ చేసి చెప్పినా... విన్నావా...! పెద్ద నేర్పరిలా.. చూడు.... కొరక లేక చస్తున్నాము.... !" దెప్పాడు శరత్.


అతని మాటలకు అవాక్కయిన మిత్రులు ..... "బాగున్నాయిలేమ్మా... వీడి మాటలకేమి... !" అంటూ సర్ది చెప్పారు.


మిత్రుల ముందు తనను అలా చులకన చేసి మాట్లాడటం వలన

ఆవిడ మనసు ఎంతగానో నొచ్చుకొంది.


*** *** *** ***

భర్త ఎంతటి అసమర్ధుడైనా. ....

దానికి గోరంతలు కొండంతలు చేసి.... పొరుగు వారితో చెప్పటం మంచిదికాదు.

భార్య తన కంటే తక్కువ అనే భావంతో నలుగురు ముందు వ్యంగ్యంగా మాట్లాడటం హర్షణీయం కాదు.భార్యాభర్తలు ఒకరికొకరు గౌరవంగా చూసుకొంటూ.. నలుగురిలో చులకన కాకుండా... చూసుకొంటూ... జీవితాన్ని హ్యాపీగా కొనసాగించుకోవాలి

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!