తెలుగు సాహిత్యంలో సత్యభామ పాత్ర! -

తెలుగు సాహిత్యంలో సత్యభామ పాత్ర!

-

శ్రీకృష్ణుని అష్టభార్యలలో సత్యభామ పాత్ర చిత్రణ


తెలుగునాట సాహిత్యంలో విశిష్టమైన పాత్ర సంతరించుకొంది.


స్వాధీనపతికయైన నాయిక గాను,సరసశృంగారాభి


మానవతిగాను, విభునికి తనపైనున్న ప్రేమకారణంగా


గర్వం మూర్తీభవించినదానిగాను సత్యభామ పాత్రను


చిత్రీకరించారు.


పోతన భాగవతంలో నరకాసుర వధ సందర్భంగా సత్యభామ


పాత్రను అందమైన పద్యాలలో చిత్రీకరించాడు.


యుద్ధం సమయంలో ఆమె హరునికి ప్రియశృంగారమూర్తిగాను,


శత్రువుకు భీకర యుద్ధమూర్తిగానుఒకేమాఱు

దర్శనమిచ్చిందట..


మ.


పరుఁ జూచున్ వరుఁ జూచు నొంప నలరింపన్, రోషరాగోదయా


విరతభ్రూకుటి మందహాసములతో వీరంబు శృంగారమున్


జరగం; గన్నులఁ గెంపు సొంపుఁ బరఁగం జండాస్త్రసందోహమున్


సరసాలోక సమూహమున్ నెఱపుచుం, జంద్రాస్య హేలాగతిన్.


భావము:

చంద్రముఖి సత్యభామ ఒక ప్రక్క కోపంతో కనుబొమలు


ముడివేసి వీరత్వం మూర్తీభవించినట్లు కను లెఱ్ఱచేసి, వాడి


బాణాలను ప్రయోగిస్తూ శత్రువు నరకాసురుడిని నొప్పిస్తోంది;


మరొక ప్రక్క అనురాగంతో మందహాసం చేస్తూ శృంగారం ఆకారం


దాల్చినట్లు సొంపైన కన్నులతో సరసపు చూపులు ప్రసరిస్తూ


ప్రియుడైన శ్రీకృష్ణుడిని మెప్పిస్తోంది.


నంది తిమ్మన పారిజాతాపహరణం, కూచిపూడి నాట్యం,


భామా కలాపం వంటి వాటిలో సత్యభామ పాత్ర చిత్రీకరణ జరిగింది.


నంది తిమ్మన పారిజాతాపహణంలో సత్యభామ పాత్రను చాలా


అద్భుతంగా చిత్రీకరించాడు.


సత్యభామ సత్రాజిత్తు కుమార్తె. శ్రీకృష్ణుని అష్టభార్యలలో ఒకరు.


ఈమె భూదేవి అవతారమని విశ్వసిస్తారు. గోదాదేవి సత్యభామ


అవతారమని అంటారు. భాగవతం దశమ స్కంధంలో సత్యభామ


వృత్తాంతంలో నరకాసుర వధను ప్రముఖంగా చెప్పారు.


అందులో చెప్పిన విషయాలు శ్యమంతకోపాఖ్యానం,


నరకాసుర వధ, పారిజాతాపహరణం, శ్రీకృష్ణ తులాభారం.


తెలుగునాట అధిక ప్రచారంలో ఉన్న కథ ప్రకారం నరకాసురుడు


తన తల్లి తప్ప వేరొకరితో మరణం లేకుండా వరం పొందాడు.


ఈ సంగతి తెలిసిన కృష్ణుడు యుద్ధంలో మూర్ఛపోయినట్లు


నటించగా, భూదేవి అవతారమైన సత్యభామ ధనుస్సు


ఎక్కుపెట్టి వదలిన బాణంతో నరకుడు మరణించాడు.

Comments