Skip to main content
‘రాజ కవి’ - ‘కవి రాజు’!
‘రాజ కవి’ - ‘కవి రాజు’!
-
తెనాలి రామకృషుల వారు నంది తిమ్మన గూర్చి
ప్రశంసగా చెప్పిన పద్యం ఇది:
మా కొలది జానపదులకు
నీ కవనపు ఠీవి యబ్బునే ! కూపనట
ద్భేకములకు గగనధునీ
శీకరముల చెమ్మ నంది సింగయ తిమ్మా !
రాయల మార్పు చేసిన పద్యం ఇది:
మా కొలది జానపదులకు
నీ కవనపు ఠీవి యబ్బునే ! కూపనట
ద్భేకములకు నాక ధునీ
శీకరముల చెమ్మ నంది సింగయ తిమ్మా !
-
(మూడో పాదంలో ‘గగన ధునీ’ అనే ప్రయోగాన్ని
‘నాక ధునీ’ అని మార్చి ‘రాజ కవి’ (కృష్ణ రాయలు) ‘కవి రాజు’ (రామకృష్ణుడు) ప్రశంసను పొందాడని ప్రతీతి)
Comments
Post a Comment