-దశావతార స్తుతి:-7.- (రామావతారం. )

 
-దశావతార స్తుతి:-7.-

(రామావతారం. )

-


"సీతా వల్లభ దాశరథే దశరథనందన లోక గురో

రావణమర్ధన రామనమో భక్తంతే పరిపాలయమాం

నామస్మరణా ధన్యోపాయ న హి పశ్యామో భవతరణే

రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే!

-

ధర్మరక్షాస్వరూపమే రామావతారం:


రామః అంటే ఆనందస్వరూపుడు. రామనామస్మరణ చేస్తే ఆనందం లభిస్తుంది. ఆ నామంలో ఉన్న మంత్రశక్తి మనలో దుఃఖాల్ని సమూలంగా నాశనం చేసి ఆనందాన్ని ఇస్తుంది. భవభయజనితమైన అజ్ఞానాన్ని, అవిద్యని పోగొట్టి మోక్షాన్ని ఇవ్వడమే ఆనందం. దాన్ని ప్రసాదించే తారకబ్రహ్మస్వరూపుడు రాముడు.


అహల్యను పాపం నించి ఉద్ధరించి శాపం నుంచి కాపాడి పతితపావనుడైయ్యాడు. అనేక యుగాలనుంచి తనకోసం తపస్సు చేస్తున్న ఋషులు వద్దకు తానే స్వయంగా వెళ్ళి అనుగ్రహించిన కారుణ్యస్వరూపుడు. రామావతారం రక్షకావతారం. శ్రీరామ అంటేనే రక్షణ లభిస్తుంది.


ఋషులను రక్షించడమంటే ఋషులతో పాటు వారు ప్రతిష్ఠించిన ధర్మాన్ని రక్షించడం. ధర్మము అంటే జగతిని పట్టి నిలిపేదని అర్ధం. ఏ ధర్మాలు మానవ జీవితాన్ని తీర్చిదిద్దుతాయో అటువంటి ధర్మాల్ని ప్రతిష్టించడానికై నారాయణుడు నరుడై అవతరించి అందరిచేతా ఆరాధింపబడి పూర్ణబ్రహ్మ ఉపాస్యుడయ్యాడు. రాముని స్మరిస్తే చాలు రక్షణ. శ్రీరామజయరామ జయ జయ రామ.


-పూజ్యగురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!