" Good families makes Good Society".

యత్ర నార్యస్తు పూజ్యంతే , రమంతే తత్ర దేవతా".. ఎక్కడ స్త్రీలు పూజింపబడెదరో అక్కడ దేవతలు కొలువై ఉండెదరు అన్న ఆర్యోక్తిని మనం అందరం చిన్న తనం నుండీ చదువుకుంటున్నాము. ఎక్కడ స్త్రీలు అవమానింపబడెదరో..అది ఎంతటి ఘనుడికైనా శాపకారకం కాగలదు. మన పురాణాల్లో మనం చదువుతూనే ఉన్నాము. శచీ దేవిని చెరబట్టిన నహుషుడు, రంభను పరాభవించిన రావణుడు, , సీతాపహరణం చేసిన రావణుడు, ద్రౌపదిని పరాభవించిన కౌరవులు, కన్న కుమార్తె అయిన సతిని శివుని మీద ఆగ్రహంతో అవమానించిన దక్షుడు, తమిళ పురాణేతిహాసం "శిలప్పధికారం" లోని కన్నగి కన్నీరు సత్యవాది, ధర్మాత్ముడు, అమిత శూరుడు ..కలియూగ ఇంద్రుడని పేరు బడసి, మదురై ని పాలించిన నెడుంజెరియన్ మహారాజు యథార్థం తెలియక ఇచ్చిన తీర్పు కన్నగి దుఃఖానికి కారణ భూతమై మదురై నగరాన్ని అతని వంశాన్ని సమూలంగా నాశనం చేస్తుంది . ఇలా ఎన్నెన్నో .. స్త్రీ కన్నీరు కారుచిచ్చు.. అది ఎంతటి వారిని అయినా దావనలం లా సమూలంగా దహించి వేస్తుంది.

ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే.. ఉత్తర ప్రదేశ్లో జరుగుతున్న అమానుషాలు గమనిస్తున్నారా ! అంతెందుకు.. నిన్న మన ఆడపిల్ల లంటే ఎందుకు ఈ దేశంలో చాలా మందికి చులకన? ఎన్నికల ముందు ములాయంసింగ్ అన్న వ్యాఖ్యలు గుర్తున్నాయా? '' ఆడపిల్లల పై జరిగే అత్యాచారాలకు ఇంత గొడవ దేనికి? ఏదో వయసులో ఉన్న మగపిల్లలు సరదా పడ్డారు . అంతే.'' ఇదీ ఆయన అభిప్రాయం. ఈ సరదా ఆయన కుటుంబంలో ఉన్న మగవారికి కూడా ఉన్నదేమో. యధా రాజా తధా ప్రజా కదా. అందుకే అక్కడ ఇంత క్రూరంగా అత్యాచారాలు కొనసాగుతున్నాయి. ఈ సారి కేంద్రం జోక్యం చేసుకుంటే తప్పనిసరి పరిస్థితులలో హోం శాఖ కార్యదర్శిని విధుల నుంచి తప్పించారు. కార్యదర్శి చేసిన తప్పేంటి? అది ఆయనకు కూడా తెలియదు . కాస్త సద్దుమణగ గానే బాధితుల భరతం పడతామని ప్రభుత్వమే అన్నదని పేపర్ వార్త. స

సృష్టికి మూలం స్త్రీ అని, స్త్రీని ఆది పరాశక్తిగా,దేశాన్నే తల్లిగా చూసిన దేశంలో , తల్లికి అగ్ర తాంబూలం ఇచ్చిన దేశంలో.. భవిష్యత్తులో తల్లులు కాబోయే ఆడపిల్లల మీద జరిగే అత్యాచారాలను సరదా అని వదిలేద్దామా ?ముస్లిం దేశాలలో ఉన్నట్లు శిక్షలు ఇక్కడ కూడా మొదలు పెట్టడం అవసరం కాదా!! నేరం ఋజువైన వారంలో అక్కడ శిక్ష అమలు అవుతుంది. అది కూడా నాలుగు రహాదారుల కూడలిలో ప్రజలందరి సమక్షంలో ..........చేసిన తప్పుకు శిక్ష వెంటనే పడుతుందని తెలిస్తే ఎవరైనా తప్పు చేసేందుకు సాహసిస్తారా ? మన దేశంలో నేరస్తులందరికి అధికారుల అండ ఉంది. అదే దేశం చేసుకున్న శాపం.. డిల్లీ నిర్భయ ఆత్యాచార హత్యలో నిందితులకు పడిన శిక్షలు కఠినంగా వెంటనే అమలు చేసి ఉంటే మళ్ళీ ఇటువంటివి పునరాఅవ్రుతం కాకపొయుండెవేమో.. అని అనుకోవచ్చు..కానీ మన చుట్టూ ఉన్న సమాజంలో , కుటుంబాలలో స్త్రీ కి తగిన గౌరవం ఇవ్వని అన్నాళ్ళు ఇలాంటివి పునారావ్రుతం అవుతూనే ఉంటాయి. మార్పు అనేది కుటుంబం నుండీ ప్రారంభం కావాలి. ఎందుకంటే " Good families makes Good Society".

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!