/నెమలి కన్ను...// చింతా దీక్షితులు

/నెమలి కన్ను...// చింతా దీక్షితులు

ధగ ధగ మెరిసే కంటిని చల్లే

కళ్ళు నెమలి కెవరిచ్చారో

పరి విప్పుతు అది నాట్యమాడగా

తాండవ కృష్ణుడు జ్ఞాప్తికిరాడా!

మేఘాలoదం. నీలాలందం

కంతల కాటుక కన్నుల అందం

అందాలన్నే జీవందాలిచి

నీలో నాట్యం చేసేనే!

జ్ఞాపకముంటే చెప్పరాదుటే

కృష్ణుని బాల్య క్రీడలు మాతో!

కృష్ణుని వేణికి నీవా అందం

నీకే అందం ఆ వేణా!

చెప్పరాదటే చిన్నీ క్రుష్ణునీ

కూకటి ముడి తో తాండవమాడిన

నాటి వైభవము నీదే అయితే

కృష్ణ గాధలనుకర్ణామృతముగ!

ఆ నాడా ముర లాలించితివట

గోపాలోన్నత శిరమున నిలిచి

మురళీ మోహన దివ్య గీతముల

ప్రతిబింబములా..నీలో తళుకులు!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!