తాళలేకున్నాను ఓ తాపసీ

 తాళలేకున్నాను ఓ తాపసీ నేను

వేళ మించకుండ వెవేగ రారాద

1. మేను పులకరించె మోము చెమరించె

మేనకను నేను మనసున్న దానను

మనసున మరులాయె మదన తాపమాయె

తనివి తీరగ నన్నుచేరంగ రారాదా

2. జపమాల యెందుకు నీ చెంతనేనుండ

తపము చాలించి నా తాపము తీర్చుమ

కోపగించక వేగ మరులనోదార్చుమ

మాపటి వేళకు మర్మమ్ము తెలియు

రచన: కొడవంటి

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!