ఛందో మంజరి..

ఛందో మంజరి.. SUBBARAO MSV GARICHEA...


ఊయల లూగే ఓ ఉత్పలమాల,

చందనము పూసుకునే చంపకమాల, 

మత్త కోకిల!నీ గళము సరళము,

నీవాలపించే పద్యము తరళము.


తేట తెలుగులో నీవాలపించే గీతి తేటగీతి,

ఆకాశంలో విహరించే ఆటవెలది,

మధురమైన నీ మాటలు మధ్యాక్కరలు,

తేటగీతిన సాగే మత్తేభములు. 


సుందరీ నీ స్వరము సప్తస్వర మంజరి,

మోహన రాగమున ఆలపించవే మాలిని,

నీ లాస్యము శ్రీనాధుని శ్రుంగార సీసము,

నీ భాష్యము విశ్వనాధ కవి రాజ విరాజితము. 


"గమనిక:-

(1) వుత్పలమాల,

(2) చంపకమాల, 

(3) మత్తకోకిల, 

(4) థరలము,

(5) తేటగీథి, 

(6) ఆటవెలది, 

(7) మధ్య్యాక్కర, 

(8) మత్తేభము, 

(9) మంజరి, 

(10) మాలిని, 

(11) సీసము మరియు 

(12) కవిరాజ విరాజితము.....ఛంధస్సును అధారంగా చేసుకొని తెలుగు పద్యాలకు పెట్టిన పేర్లు."

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!