బాపు అసలు పేరు సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ.

అయ్యా బాపు గురించి ఈ నవతరానికి తెలియాలి అందుకే ఈ పోస్టింగ్ సు. అయన అసలు పేరు కూడా తెలియని వారు ఎంతో మంది ఉన్నారు.

.

బాపు అసలు పేరు సత్తిరాజు వెంకట లక్ష్మీనారాయణ. బాపు డిసెంబరు 15, 1933 వ సంవత్సరం లో పశ్చిమ గోదావరి జిల్లా, నర్సాపురం లో వేణు గోపాల రావు, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించాడు.1955 వ సంవత్సరం లో మద్రాసు విశ్వవిద్యాలయం నుండి లాయర్ పట్టా పుచ్చుకున్నాడు. 

బాపు తెలుగునాట పేరెన్నికగన్న బహుముఖ ప్రజ్ఙాశాలి. బాపు గీత, బాపు వ్రాత తెలుగువారి సంస్కృతిలో భాగమయ్యాయి. బాపు చిత్రం ప్రచురించని తెలుగు పత్రికలు అరుదు. ఆయన వేసిన కార్టూనులూ, పుస్తకాల ముఖచిత్రాలూ లెక్క పెట్టడం కష్టం.

'బాపు బొమ్మ' అనే మాట ఈరోజు చిత్రశైలికీ వాడుతారు, అందాల భామను వర్ణించడానికీ వాడుతారు. బాపు బొమ్మల గురించి ప్రసిద్ధి గాంచిన కవి ఆరుద్ర పద్య రూపంలో తన కవితల పుస్తకములో హృద్యంగా వర్ణించిన తీరు చిరస్మరణీయమైనది ఒకటుంది.

కొంటెబొమ్మల బాపు

కొన్ని తరముల సేపు

గుండె ఊయలలూపు

ఓ కూనలమ్మా!

ఇలా కూనలమ్మ పదం వ్రాసి, ఆరుద్ర బాపుకు ఎప్పుడో చేసిన పద్యాభిషేకంతో ఏకీభవించని వారు లేరు. బొమ్మలే కాదు, బాపు చేతిలో తెలుగు అక్షరాలు కూడా హొయలు పోయాయి. ఇప్పుడు ఈయన చేతివ్రాతకూడ బాపు ఫాంటుగా అలరిస్తోంది. అందమయిన చేతిరాతకి అందరికి గుర్తొచ్చే ఫాంటు ఇదే అవటం అతిశయోక్తి కాదు.

ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన తెలుగు, హిందీ సినిమాలు అవార్డులు, రివార్డులు పొందటముతో పాటు అచ్చ తెలుగు సినిమాకి ఉదాహరణలుగా చరిత్రలో నిలిచిపొయాయనటం పొగడ్త కాదు.

క్లుప్తంగా ఈయన గీసిన బొమ్మని సంతకం లేకపోయినా, తీసిన సినిమాలో దర్శకుడిగా ఈయన పేరు చూడక పొయినా చప్పున ఎవరయినా ఇది గీసింది, తీసింది బాపూ అని గుర్తించగలిగేటంత విలక్షణమయిన శైలి ఈ ప్రతిభావంతుడి సొత్తు.

బాపుకు స్వదేశీ, విదేశీ పురస్కారాలు ఎన్నో లభించాయి. అందులో ముఖ్యమయినవి కొన్ని.

బాపు దర్శకత్వం వహించిన ముత్యాల ముగ్గు చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా (1975 వ సంవత్సరం) భారత ప్రభుత్వ పురస్కారం తో పాటు సినిమాటోగ్రాఫర్ ఇషాన్ అర్యాకి ఛాయగ్రాహకుడిగా పురస్కారం.

1986 వ సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి ఎ.పి కళా వేదిక ద్వారా రఘుపతి వెంకయ్య స్మారక పురస్కారం మదర్ థెరిస్సా బహూకరించగా తన స్నేహితుడు ముళ్ళపూడి వెంకట రమణ తో కలిసి స్వీకారం

చెన్నై(తమిళనాడు) లో స్థాపించిన శ్రీ రాజలక్ష్మి ఫౌండేషన్ వారి ప్రతిష్ఠాత్మకమయిన రాజ్యలక్ష్మి పురస్కారం 1982 వ సంవత్సరంలో ఇవ్వబడింది.

1991 వ సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ కళాప్రపూర్ణ బహూకరణ.

1992 వ సంవత్సరంలో అమెరికా తెలుగు అసోసియేషన్ (ATA) వారిచే శిరోమణి పురస్కారం అమెరికాలో స్వీకరణ.

మిస్టర్ పెళ్ళాం సినిమాకి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా భారత ప్రభుత్వ పురస్కారం.(1993 వ సంవత్సరం).

1995 వ సంవత్సరంలో తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా (TANA) వారిచే తెలుగు చిత్ర కళా, సాహిత్య, సాంస్కృతిక, సినిమా రంగాలకు తన ఏభై సంవత్సరాల(గోల్డెన్ జూబ్లీ సెలేబ్రషన్) సేవకు గాను ఘన సన్మానం.

బాపు మీద ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు వంశీ తీసిన డాక్యుమెంటరీ చిత్రానికి 1996 వ సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నంది అవార్డు.

9 జూన్, 2001 వ సంవత్సరంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్టూనిస్ట్స్ (IIC) వారిచే జీవిత సాఫల్య పురస్కారం తో సన్మానం.

2 జూన్, 2001 వ సంవత్సరంలో డిసెంబరు న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిచే విశిష్ట పురస్కారంతో గౌరవం.

అకాడమీ అఫ్ ఫైన్ ఆర్ట్స్, తిరుపతి వారిచే ప్రెసిడెంట్ అఫ్ ఇండియా అవార్డు బహూకరణ.[5]

బాలరాజు కథ (1970), అందాల రాముడు (1973), ముత్యాల ముగ్గు (1975),పెళ్లి పుస్తకం (1991), మిస్టర్ పెళ్ళాం (1993) సినిమాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి నంది పురస్కారాలు.

2013 కు గానూ ప్రకటించిన పద్మ పురస్కారాలలో కళల విభాగంలో తమిళనాడు రాష్ట్ర విభాగంలో పద్మశ్రీ పురస్కారం.






Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!