ద పవర్ ఆఫ్ నల్లి ది గ్రేట్..!

నల్లి శక్తి ఎంతటిదో ఒక కవివరుడుకి..అవికుట్టిన కుట్టుకి దిమ్మ తిరిగి అప్రతిహతంగా నోటి వెంట వచ్చిన పద్యం వినండి..సారీ చదవండి..

కమలే కమలా శేతే

హర్శ్శేతే హిమాలయే

క్షీరాబ్దౌ హరిశ్శేతే

మన్యే మత్ కుణశంకయా

దీని భావమేమి తిరుమలేశా అనే కదా..మీ ఫీలింగు.. ఇదిగో ..!!

కమలమునందు లక్ష్మి ఉంటుంది.. హిమాలయంలో శివుడు ఉంటాడు..విష్ణువు క్షీరసాగరంలో ఉంటాడు..ఎందుకంటే నల్లి బాధపడలేక పారిపోయి అక్కడ తలదాచుకొని ఉంటారు..అంతకు మించి వారు అక్కడెక్కడో కాపురం ఉండటానికి వేరు కారణాలు లేవు అన్న రీతిలో కవి చమత్కారం ..అదన్నమాట.. పెద్దలమాట.. నీరు దాటి కమలంలోకి నల్లి వెళ్లలేదు.. చలిలో నల్లి బ్రతకలేదు.. పాల సంద్రం దాటి వెళ్లి విష్ణువుని కుట్టనూ లేదు.. ఆహా నిజమే కదూ మీకూ డౌటొస్తుంది కదూ..!

అదండీ నల్లి శక్తి...ద పవర్ ఆఫ్ నల్లి ది గ్రేట్..!


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!