నలుపూ నలుపనియేరు నలుగురూ నవ్వేరు

ఈ పాట తెలంగాణ లోని మెహబూబ్ నగర్ జిల్లా లో మాదిగల అశ్రితకులమైన పాటగాళ్ళు వసంత నవరాత్రులకు పాడుకునేది. )

సేకరణ: గడియారం భార్గవ, అలంపురం

.

వశిష్ఠాశ్రమములొ విద్యనభ్యసించటానికి వెళ్ళినపుదు తోటి పిల్లలు రాముడు నల్లగావున్నడని గేలిచేస్తుంటే రాముడు ఏడుస్తూ పాడే పాట.

.నలుపూ నలుపనియేరు నలుగురూ నవ్వేరు నలుపు నారాయణ ముర్తే కద 

.గురుడూ గంగాపురము గరళాకంఠుని కడవ నలుపే కద

ఆవులు యెరుపైనా అమృతాము తెలుపైనా 

కుడిచేటి దుత్తలు నలుపే కద

వరిసేను పచ్చైన వరి కంకి పసుపైన 

కోసేటి కొడవళ్ళు నలుపే కద

సూరీడు ఎరుపైనా సుక్కాలు తెలుపైన

సూసేటి నయనాలు నలుపే కద

మడిసెంత గొప్పైన మడిసెంత యెత్తైన 

నడిసేటి నీడలు నలుపే కద

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!