కష్టమేపడె తన్నామె కనెడువేళ

కష్టమేపడె తన్నామె కనెడువేళ 

చంకనెత్తుకు పెంచెను చన్ను గుడిపె 

తప్పటడుగులు వేసెడి తరుణమందు 

పట్టు వదలక నడిపించె మెట్టు మెట్టు 

గోరు ముద్దలు తినిపించె కూర్మితోడ 

కంటికిన్ రెప్పవలె తన్ను కాచెనెపుడు 

ఇప్పుడాకన్నులె సరిగ విప్పలేదు 

లేచి తిరుగాడ వంటిలో లేదు శక్తి 


 



చదువు కొనగ జేర్చెను పాఠశాలయందు 

పెంచి పెద్దచేసెనమిత ప్రేమతోడ 

తగిన కన్యనిల్లాలుగా తనకు గూర్చె 

అతడు జనకుడు ఇపుడసహాయుడయ్యె 




ముసలి వారంచు ఛీకొట్టి మోము దాచి 

వారి కర్మకు వారిని వదిలివేసి 

తాము తమబాగు నెంచెడి తనయలుండు 

రోజులివియౌర హరహరా రోతపుట్టె! 


నన్ను కన్నట్టి జననీజనకులు వీరు 

వయసు వుడిగిన వేళలో వారి బాగు 

చూడవలెననెడి తపన సుంతయేని 

సుతుల కేది? వృద్ధాశ్రమచూపు తప్ప 



 



రచన : కాలనాధభట్ట వీరభద్రశాస్త్రి


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!