వాన దేవుడు సేయు కొంటె పనులు

శ్రీమతి మదమంచి యనంతమ్మ గారు రాసిన కవిత....
వాన దేవుడు సేయు కొంటె పనులు
ప్రక్రుతి వానదేవునికి స్వాగతిస్తున్న తీరు..చూడండి
వర్ష లక్ష్మికి యాతిధ్య ప్రధమ ధర్మములైన యర్ఘ్య పాదములందించు తీరు
గొల గొల జారెడు కొండవాగులు
పసరుల గ్రక్కెడు పచ్చిక పట్టులు
జీబులుదేరెడు చివురు జొంపములు
మోసులు గట్టిన మొలక పైరులు
అర్ఘ్యపాద్యముల నర్పించూ,ప
చ్చకు పుట్టముల నందించూ,మే
ల్పసిమి జాలరుల బరిపించూ,ఓ
సజల జలదమా! స్వాగతము''
తుంటరి వానదేవుడు చేయు కొంటేపనులు..ఇలా వర్ణించారు
మాటున దాచిన తాటి గొడుగులను
పల్లె బాబుచే బట్టిన్చెద వోయి!
కమత గాండ్ర కరి కంఠము గూర్తు
గొల్లవారి తల గొంగళ్ళుఇడేదవు
అటునిటు పనికై యరిగెడు సతులకు
చేటలు నెత్తిన దీటు గొల్పెదవు
కర్ర పెత్తనము గల పెద్దలకు
గుడ్డ గొడుగు గీల్గొలుపుదువన్నా!
కొమ్ములు దిరిగిన కోటీశ్వరునకు
చెప్పులు చేతికి చేర్చి కుల్కెదవు.''
పైగా ఎప్పుడు రాకూడదో కూడా చెప్పారు
ఖండ వృష్టి యని గర్హించెడి మా
కాపు కుమారుల కండ్ల నీళ్ళతో
పిడకలు,పుడకలు.పిండి పప్పులును
ఎండపోయు తరి నేతెoచితివా
సుదతులు పల్కెడి సూటి పోట్లతో''
వేళా పాళా లేకుండా రావొద్దని హెచ్చరించింది

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!