Skip to main content
కాలంతో, కలంతో ఎలా మసులుకోవాలో తెలిసిన కవి..
కాలంతో, కలంతో ఎలా మసులుకోవాలో తెలిసిన కవి..
సినారె...జన్మదినాన ..........
జనం నోట్లో
-----------
ఒలుకుతున్నాను నేను
కలం గొంతుకనుంచి
కాలంలా పరుచుకున్న
కాగితం గుండెమీద.
ముద్దగా ఇంకిన చుక్కలు
మొనదేలిన అక్షరాలై
ఎగిరిపోయాయి కాగితాన్ని
ఎడమకాలితో తన్నేసి.
"ఏవీ ఆ అక్షరాలు?
ఏదీ నా ఆనవాలు?"
అవి పదిలంగా నలుగుతూ ఉన్నాయి
అరిగిపోని జనం నోట్లో!!
1979లో ముద్రణ రూపం దాల్చిన " మృత్యువు నుంచి..బతుకులోకి" కవితల సంకలనంలో ఇవి ఆయన అక్షరాలు..
x
Comments
Post a Comment