భారతీయ సంస్కృతి వేదాలు ఏమి చెపుతున్నాయి.

భారతీయ సంస్కృతి వేదాలు ఏమి చెపుతున్నాయి.

మాత్రు దేవో భవ

పితృ దేవో భవ

ఆచార్య దేవో భవ ఇది ఈ మహావాక్యాలు తైతీరీయోపనిషత్ లోనిది. ఇక్కడ స్త్రీ ని ప్రదం దైవముగా చూడమన్నారు.భవ శబ్దానికి తెలుసుకొను అని అర్ధం . స్త్రీ కి ఎంత గౌరవం మన ప్రాచీనులు కల్పించారో చూడండి.వివాహ సమయంలో కన్య దాత వద్దకు వచ్చి వరుని తండ్రే ఇలా అడుగుతాడు."ధర్మ ప్రజా సంపత్యర్ధం వృణీమహే." అని అడుగుతాడు.అనగా ధర్మ పరమైన సంతానం కొరకు ఈ కన్యనువదువుగా అడుగుచున్నాను. అప్పుడు వధువు తండ్రి వృణీదం అలాగే కానిండు. అంటాడు. కనుక స్త్రీ కి ఎంత గౌరవం కల్పించారో మన గ్రహించాలి.స్త్రీ భోగవస్తవు కాదు. సమాజానికి పనికి వచ్చే ధర్మ పరమైన సంతానాన్ని ఇవ్వటానికి మాత్రమే స్తీ ని వివాహ మాడాలనే భావన మన పూర్వీకులు ఏర్పరచటం మనందరం గౌరవించ తగ్గ సాంప్రదాయం.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!