శ్రీనాధుని భీమ ఖండ కధనం.

శ్రీనాధుడు పిఠాపురాన్ని వర్ణించాడు ..

(శ్రీనాధుని భీమ ఖండ కధనం.)

.

ఏలేరు ప్రవహిమ్చే చోటు ,మూడు వందల అరవైమంది దేవతలు సంచరించే వేదిక ,

పీరాంబ చెలి అయిన హుమ్కార దుర్గ కావలి ఉండే ప్రదేశం ,

కుంతీ మాధవస్వామి కొలువైన నెలవు ,

దిగంబరుడైన కాలభైరవుడున్న తావు" పీఠికా పూరం."

పంచమాధవులు అంటే-పితాపురం లోని కుంతీ మాధవుడు 

ప్రయాగ లోని వేణీ మాధవుడు ,రామ తీర్ధం లోని లీలామాధవుడు ,

రామేశ్వరం లోని సేతుమాధవుడు ,వారణాసిలోని బిందుమాధవుడు .

పితాపురం లో ప్రతి ఏడాది రెండుపంటలుగా’’ ప్రాసంగి ‘’అనే వరి పండుతుంది

అణి వేరు పనస వాసలకు తుమ్మెదలు మూగుతాయి .పోకపువ్వుల వాసనలుంటాయి.

వేశ్య వాటికలలో నిత్యం మన్మధ లీలలు నిరాటంకంగా జరుగుతాయి 

.పాటలీ పుష్పాల మొగలి పూల వాసనలు నాసికకు హాయి చేకూరుస్తాయి 

నారిమ్జలతో ,సువాసనలిచ్చే పొన్న చెట్లతో మల్లెవాసనలతో బంధుత్వం నేరపుతాయి 

వింధ్యకు దక్షిణంగా ఉందడి ,వరిపంటలతో విరాజిల్లి ,కొబ్బరి అరటి తోటలతో కళకళ లాడుతుంది కుంతీ మాధవ స్వామికి హుమ్కారినీ దేవికి ,పీఠాంబికకు ,హేలాదేవికి నిలయమై ఉన్న పిఠాపురం లో వ్యాసర్షి శిష్యులతో చేరుకొన్నాడు .ఇక్కడి నేల సారవంతమైనది .అన్ని రకాల పంటలూ పండుతాయి .

‘’హాటక పాన పాత్రయును నారగ బండిన మాతులుంగముల్-

ఖేటము లోహ దండము నోగిం ధరియించి పురోప కంఠ,శ్రుం"

గాటక భూమి భాగమున గాపుర ముండేడు పీఠి కాంబకుం –

గైటభదైత్య వైరి ప్రియ కాంతకు మ్రొక్కె నతండు భక్తీ తోన్’’

వ్యాసమహర్షి పిఠాపురం లోని శృంగాటకం లో ఉన్న బంగారు మధు పాత్ర ,

మాదీఫలం ,డాలు ,దండం చేతులలో ఉన్న విష్ణు పత్ని అయిన

పీఠికాంబ కు నమస్కరించాడు

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!