కాళిదాసు ... చాటువులు.!

కాళిదాసు ... చాటువులు.!

.

భోజ మహారాజు కవితాప్రియుడు. ఎవరైనా చక్కని కవిత్వం చెపితే ఆ శ్లోకంలో ఎన్ని అక్షరాలు ఉంటే అన్ని లక్షలధనం ఇచ్చేవాడట. అంటే ‘అక్షరలక్షలన్నమాట. ఆ కవిత్వంలోని మంచి చెడులను నిర్ణయించేది కాళిదాసు మహాకవి. అందుకని కవులందరూ ముందుగా కాళిదాసుని కలిసి, అతనిని మెప్పించి, తరువాత భోజుని ఆస్థానానికి వెళ్ళేవారుట

..

ఒకరోజు ఇద్దరు పేద పండితులు కాళిదాసువద్దకి వచ్చి ఎలాగైనా రాజుగారిచేత కొంత ధనం ఇప్పించి మా దరిద్రం తీర్చమని వేడుకొంటారు. వాళ్ళు కవులుకాదు. వాళ్ళ దీనస్థితిని చూసి కాళిదాసు “రేపు రాజాస్థానంలో మీకు తోచినది చెప్పి, మౌనంగా ఉండండి ఆపై నేను చూసుకొంటాను అని చెప్పి అభయం ఇస్తాడు.

.

మరునాడు ఆ పండితులు భోజమహారాజు ఆస్థానానికి వెళ్ళి, ఆవైభావాన్ని చూసి కంగారు,కంగారుగా రాజుగారికి నమస్కరిస్తారు. కాళిదాసు వారిద్దరూ మహాకవులని రాజుగారికి పరిచయం చేస్తాడు. రాజుగారు ఏదైనా కవిత్వం చెప్పమని అడుగుతారు. 

అసలే కంగారుగా ఉన్న పండితులలో మొదటివాడు “ఆణోరణీయాన్ మహతో మహీయాన్” అని గబగబా గీతలోని శ్లోక పాదాన్ని చెప్పి ఊరుకొంటాడు.

వెంటనే రెండవ పండితుడు యజ్ఞోపవీతాన్ని తడుముకొంటూ “యజ్ఞోపవీతం పరమం పవిత్రం” అని యజ్ఞోపవీతాన్నిధరించేటప్పుడు చెప్పే మంత్రంలోని ఒక పాదాన్ని చెప్పి ఊరుకుంటాడు

.

అపుడు రాజుగారు “మీరు చెప్పిన రెండుపాదాల్లో కవిత్వం ఏముంది. మొదటిది భగవంతుడు అణువుకన్నా చిన్నదైన పరమాణువు లోను, పెద్దవైన వస్తువులలో కెల్లా పెద్ద వస్తువులోనూ ( అనగా అన్నింటిలోను) నేను ఉంటాను అని చెప్పినదికదా! అలాగే యజ్ఞోపవీతం పరమ పవిత్రమైనది అని రెండవ పాదానికి అర్థం కదా! ఇదికాక మీరుచెప్పినదానిలో ఇంకేమైనా విశే షార్థం ఉందా? అని ప్రశ్నిస్తాడు.

అప్పుడు ఆ పండితులు కాళిదాసువైపు చూస్తారు. వెంటనే కాళిదాసు కలుగజేసుకొని రాజుతో ఇలా అంటాడు. “మహారాజా! వీరిద్దరూ మహాకవులు. అంతేగాక గొప్ప రసికశిఖామణులు. పై రెండుపాదాలలో స్త్రీ సౌందర్యాన్ని చక్కని శృంగార భావంతో వర్ణించారు. మహాకవులు కనుక సమస్యాపూరణంగా తెలిపి వదిలి వేసారు. వారి భావానికి తగిన విధంగా నేను పూరిస్తాను చిత్తగించండి.” అని పలికి, సరస్వతీ మాతను మనసులో ధ్యానించుకొని శ్లోకాన్ని అద్భుతంగా పూరిస్తాడు. 

.

“ఆణోరణీయాన్ మహతో మహీయాన్

మధ్యో నితంబశ్చ మదంగనాయాః

తదంగ హారిద్ర నిమజ్జనేన 

యజ్ఞోపవీతం పరమం పవిత్రం”

.

అద్భుతముగా పూరించిన కాళిదాసు కవితాచమత్కారానికి రాజుగారితో సహా సభికులెల్లరూ ఆనందంతో కరతాళధ్వనులు చేస్తారు. కాళిదాసు నోట ఇంతటి చక్కని చాటు శ్లోకం రావడానికి కారణభూతులైన ఆ పండితులను భోజమహారాజు ‘ఘనంగా’ సత్కరించి తన కవితా ప్రియత్వమును చాటుకొంటాడు.

అదే పైశ్లోకం. దానిభావం పరిశీలిద్దాం .

.

“ఆణువుకన్నా చిన్నదైన పరమాణువు అనగా కనిపించీ కనిపించనిది 

అనికదా భావం. అట్లే మహత్తు కన్నా మహత్తు పెద్దవాటిలో పెద్దది అనికదాభావం.

అవి అందమైన, యవ్వనంలో ఉన్న స్త్రీయొక్క మధ్యమము

అనగా(సన్నని) నడుము,

మరియు నితంబము (పృష్ఠ భాగము) పెద్దది గాను ఉన్నదనియు, 

అట్టి స్త్రీని ఆలింగనం చేసికొన్నపుడు, ఆమె ఒంటికి రాసుకొన్న పసుపుతో కలసిన యజ్ఞోపవీతము, పరమ పవిత్రమైనది కదా!”

.

అని పండితులు చెప్పిన రెండుపాదాలకి తన కవితా వైభవంతో మరి రెండు పాదాలను కలిపి పూరిస్తాడు. అద్భుతముగా పూరించిన కాళిదాసు కవితాచమత్కారానికి రాజుగారితో సహా సభికులెల్లరూ ఆనందంతో కరతాళధ్వనులు చేస్తారు.

కాళిదాసు నోట ఇంతటి చక్కని చాటు శ్లోకం రావడానికి కారణభూతులైన ఆ పండితులను భోజమహారాజు ‘ఘనంగా’ సత్కరించి తన కవితా ప్రియత్వమును చాటుకొంటాడు. 

ఇదీ కాళిదాసు కవితా స్ఫూర్తి అంటే !చూసారా! కాళిదా స కవితావైభావం.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!