ముక్త పద గ్రస్తాల మురిపాలు!

ముక్త పద గ్రస్తాల మురిపాలు! 

-

ముక్కపద గ్రస్తం ఒక శబ్దాలంకారం. యెంతోమంది కవులు ప్రయోగించారు.

కానీ వారిప్రయోగాలు అసమాపక క్రియలకే పరిమితం. ప్రబంధయుగంలో ఒక మహాకవియున్నాడు.

అతనిపేరు రామరాజ భూషణుడు. యితనికే భట్టుమూర్తి యని నామాంతరం

. ప్రతిభా వ్యుత్పత్తులు పుష్కలంగా ఉన్న కవి.

రామరాజృభూషణుని రచన "వసుచరిత్రము'" అదియొక అద్భుతాల గని .కవితా యామని విరబూచిన సుమధుర భావనాల వని. అందులో నాల్గవ యాశ్వసంలో యితడో ముక్త పద గ్రస్తం తోకూడిన యొక సీసపద్యం రచించాడు. అందు అసమాపక క్రియలకు మారుగా, నామవాచక పదాలుండటం విశేషం! అదిగో ఆపద్యాన్ని మీకు పరిచయం చేస్తాను. దానికి ముందు సందర్భంతెలిసి కుందాం.

గిరిక (కావ్య నాయిక) వసురాజుని ప్రేమిస్తుంది.

మధ్యలో విరహం. ఆవిరహ బాధలతో వేగిపోయే గిరికకు ఊరట కలిగించటం కోసం

ప్రయసఖి మంజువాణి గిరికా వసురాజుల మధ్య ప్రెణయ రాయబారావికి పూనుకొంది. 

గిరిక ముత్యాల హారం వసురాజుకిచ్చింది. గిరికపై మరులుుగొన్న వసురాజు ఆమెకు తన ప్రేమకానుకగా గిరిక కీయటంకోసం తన పుష్యరాగ మణిఖచితమైన అంగుళీయకాన్ని యిచ్చాడు. దానిని చేతబట్టి యాకాశమార్గాన మంజువాణి వస్తూంది. ఆమణికాంతులు ఆకాశంలో విమతగా మెఱుస్తుంటే, గిరిక చెంతనున్న చెలికత్తెలు పర పరి విధాల భావించటం ఇందున్న విషయం;

.

సీ: ఇది తమ్మికంటిపై నీసడించిన 

నిశాధవు దోలు లోక బాంధవుని పొడుపు'

పొడుపు కాదిది తల్లి పడతి కెత్తగ దెచ్చు 

రక్త రాజీవ నీరాజనార్చి,

అర్చి కాదిది సహజానురక్తి నగా 

త్మజను గదియు నోషధుల ఛాయ,

ఛాయ కాదిది కూతు చంద మారయ వచ్చు 

కోలాహలుని రక్త కూట దీప్తి,

గీ: దీప్తిమాత్రంబు గాదిది దివ్య ధామమనుచు 

జెలు లాడుకొను లోన చెలువు మీర

వచ్చె నంత నానృపాలాంగుళీయ 

రంజి తాత్మీయపాణియై మంజువాణి!

.

వసుచరిత్ర వ్యాఖ్యా సహాయ మున చదువ దగిన యత్తమఃప్రబంధము!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!