శ్రీ గాయత్రి దేవి - శ్రీ గాయత్రి మంత్రం !


శ్రీ గాయత్రి దేవి - శ్రీ గాయత్రి మంత్రం !

-

"ఓం భూర్భువస్వః

తత్స వితుర్వరేణ్యం

భర్గో దేవస్య ధీమహి

ధియోయోనఃప్రచోదయాత్!

-

గాయత్రి జపం నాలుగు దిశల నుండి శక్తిని తీసుకుని వచ్చును.

వర్తమాన చికిత్సా పద్ధతి సర్వవిధముల ధర్మ రహితమయ్యెను. విధి ప్రకారం ప్రతిరోజు గాయత్రి జపం చేయువాడు ఎన్నటికీ రోగ గ్రస్థుడు కాజాలడు. 

పవిత్రమైన ఆత్మయే పరిశుద్ధమైన శరీరమును నిర్మింప కలుగును. ధార్మిక జీవన నియమము యదార్ధముగా శరీరాత్మలను కాపాడకలదని నానిశ్చితాభిప్రాయము.

-

గాయత్రీ మంత్రం లోని ప్రతి అక్షరం బీజాక్షరమని మహిమాన్వితమైనదని విజ్ఞుల భావన. 

ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుతించినట్లని పెద్దలచే సూచింపబడింది. మంత్రంలోని ప్రతి పదానికి అర్ధం క్రింద చూడండి.

-

ఓం = పరమేశ్వరుడు సర్వరక్షకుడు.

భూః = సత్ స్వరూపుడు (ఉనికి కలవాడు).

భువః = చిత్ స్వరూపుడు(జ్ఞాన రూపుడు).

స్వః = ఆనంద స్వరూపుడు(దుఃఖరహితుడు).

తత్ = అట్టి సచ్చినానంద లక్షణయుక్తమైన పరమేస్వరుడు.

సవితుః = ఈ సృష్టి కర్త.

వరేణ్యం = సుఖ స్వరూపుడగుటచే జీవులందరి చేత ఆరాధింపబడేవాడు.

భర్గః = శుద్ధ స్వరూపుడు (పాప రహితుడు).

దేవస్యః = అట్టి అనేక దివ్యగుణములు కలిగిన దేవుని యొక్క దివ్యస్వరూపము.

ధీమహి = హ్రుదయాంతరాల్లో (ఆత్మలో ఏకమై)

యః = ఆ పరమేశ్వరుడు.

నః ద్యః = మా బుద్ధులను.

ప్రచోదయాత్ = సత్కర్మలయందు ప్రేరేపించి అభ్యుదయ శ్రేయములు పొంద సమర్ధం చేయుగాక.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!