సైరంధ్రి - కీచకవధ.!

Vinjamuri Venkata Apparao's photo.


సైరంధ్రి - కీచకవధ.!
.
ఇందులో నాయకుడు బీముడు, నాయిక ద్రౌపది, ప్రతినాయకుడు కీచకుడు. ఇందు ద్రౌపది నిర్వహించిన పాత్ర సైరంద్రీ జాతి స్త్రీ – పేరు మాలిని.
ఈనాటి స్త్రీలు కూడ తమను వేధించే పురుషులను “నీకక్కచెల్లెళ్ళు లేరా?” అని అడగడం పరిపాటి. అదే ద్రౌపది కీచకుణ్ణి అడిగింది. అయినా ఆ నీచకీచకుడు తన బుద్ధిని సరిచేసికొనక పదే పదే ఆమెకు తన కోర్కెను తెలియ జేసేసరికి సహజంగానే ఆమెకు కోపం వచ్చింది. నయాన మాట వినని వాణ్ణి భయపెట్టే ప్రయత్నంచేసింది. కీచకుణ్ణి బెదిరించడానికి కూడ జంకని ధీరవనితగా దర్శనమిస్తుంది. సైరంధ్రిని శృంగార నాయికగా కీచకుడు తలపోస్తే ఆమె రౌద్ర భయానక రసాల్ని తన మాటల్లో ప్రదర్శించింది. ’అన్న’ అన్న సంబోధన, ’కీచకా’ అని మారిపోయింది. తిక్కనామాత్యుడు ఒకే పర్వంలో ఒకే పాత్రనోట ఒకే పద్యాన్ని వేర్వేరు సన్నివేశాలలో పలికించడం ప్రత్యేకతను సంతరించుకునే విషయమే ఆ పద్యమిదే:

“దుర్వారోద్యమ బాహుమిక్రమసాస్తోక ప్రతాపస్ఫుర
ద్గర్వాంథప్రతివీరనిర్మథనవిద్యాపారగుల్ మత్పతు
ల్గీర్వాణాకృతు లేవు రిప్డునిని దోర్లీలన్ వెసం గిట్టి గం
ధర్వుల్ మానముఁ బ్రాణముం గొనుటా తథ్యం బెమ్మెయిం గీచకా” (విరాట II-55 & విరాట II-172)
.
.
ప్రణాళిక ప్రకారం సుదేష్ణ సైరంధ్రిని మద్యం కోసం కీచకుని మందిరానికి పంపదలచింది. ద్రౌపది ఎంత నిరాకరించినా సుదేష్ణ నిష్టురోక్తులకామె బయల్దేరక తప్పలేదు. నిర్వేదస్థితిలో శోకరసాన్ని వహించిన నాయికగా కన్నీళ్ళుకారుస్తూ బయల్దేరినా ఆమె ధైర్యాన్ని వదలలేదు. భయం, సంకోచం, దు:ఖం, ప్రయత్నం చేసింది. ఆమె ధైర్యానికి ఆలంబనం ఆమెకంతర్గతంగా ఉన్న అచంచలమైన దైవభక్తి. భర్తల దోర్బలానికి, తన దైవభక్తి తోడుగా ధైర్యలక్ష్మిని మనస్సున నిల్పుకున్నా ప్రస్తుతం నిస్సహాయరాలైన ఆ యిల్లాలు తన కష్టం గట్టెక్కడానికి కర్మసాక్షి ఆదిత్యునకు నమస్కరించింది.

“పాండుపుత్రుల కేను దప్పనిమనంబు
గలుగుదానన యేని కమల మిత్త్ర
కీచకుని దెస న న్నొక కీడు తెరువు
వొరయ కుండఁగ రక్షింపు కరుణతోడ” (విరాట II-108)

అని ప్రార్థించిన ఆమెకు రక్షగ సూర్యుడొక బలఢ్యుడైన రాక్ష్సుణ్ణి అదృశ్యరూపంలో పంపించాడు. విశిష్టమైన ఆమె భక్తితత్పరతకు పుండరీకాక్ష, పుండరీకవల్లభులు సాయ్పడగలరను ధైర్యం సైరంధ్రిది. అయితే అంత ధీరయు భయాందోళనలు ముప్పిరిగొనగా ’బెబ్బులి యన్న పొదరు సొచ్చు లేడి చందంబున’ కీచకుని మందిరంలో ప్రవేశించింది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!