శ్రీ కాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(16 / 6 /15.) .

శ్రీ కాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(16 / 6 /15.)
.
. నిప్పై పాతకఁదూలశైల మడచున్ నీ నామము న్మానవుల్
దాపున్ దవ్వుల విన్ననంతక భుజాదర్పోద్ధత క్లేశముల్
తప్పుం దీరును ముక్తలౌదురని శాస్త్రంబు ల్మహాపండితుల్
చెప్పంగా దమకింక శంకలుండవలెనా ? శ్రీ కాళహస్తీశ్వరా !
.

శ్రీ కాళహస్తీశ్వరా ! పవిత్రమైన నీ నామమును మానవులు దగ్గరనుండైనా , దూరమునుండైనా విన్నంతనే పుణ్యమనే అగ్ని పాపాలనే ప్రత్తి కొండలను భస్మం చేస్తుందని , యమ ధర్మరాజు భుజ గర్వముచే ఉత్పన్నమయ్యే చిక్కులన్నీ తొలగి పోయి ముక్తులౌతారని శాస్త్రాలు , మహా పండితులు చెపుతుంటే , ఈ మానవులకు ఇంకా నీనామ మహాత్మ్యము పై అనుమాన మెందుకు శంకరా ?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!