శ్రీ కాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(15 / 6 /15.)


.
శ్రీ కాళహస్తీశ్వర శతకము.........ధూర్జటి...(15 / 6 /15.)
.
.ఆలున్ బిడ్డలు తల్లిదండ్రులు ధనంబంచు న్మహాబంధనం
బేలా నామెడ గట్టినాడ విక నిన్నేవేళ జింతింతు ,ని
ర్మూలంబైన మనంబులో నెగడు దుర్మోహాబ్ది లో గ్రుంకి యీ
శీలామాలపు జింత నెట్లుడిపెదో ? శ్రీ కాళహస్తీశ్వరా !
.

శ్రీ శంకరా ! భార్యాబిడ్డలు , తల్లిదండ్రులు , ధనము అనే ఈ బంధాలన్నింటినీ నామెడ కెందుకు కట్టావు . ఇక నేను నిన్ను ఏ విధంగా స్మరించగలను . నీ యెడల నశించి పోయిన మనస్సు లో పెరుగుతున్న మోహమనే సముద్రం లో మునిగిన ఈ దుఖాన్ని ఎలా పోగొడతావో కదా ?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!