నందామయా గురుడ నందామయా

తెలుగు పల్లె పాటలు
సంకలనం:శ్రీ ప్రయాగ నరసింహశాస్త్రి
హాస్యపు పాటలు......కలికాలం తీరు..బ్రహ్మంగారి తత్వము.!
.
( రానున్న విడ్డూరాలగూర్చి వర్ణిస్తూ బైరాగులు ఒక జట్టుగా పాడుకొనేపాట.)
.
నందామయా గురుడ నందామయా
ఆనందజ్యోతికి నందామయా

అత్తలకు పీటలు కోడలికి మంచాలు
మామనెత్తిన తట్ట పెడతారయా
వరికూడు తిని యేరువరుసలే తప్పారు
మగని పేరు బెట్టి పిలచేరయా
ముండలంతా గూడి ముత్తయిదులౌతారు
గూడూరిసందున గున్న చింతలక్రింద
గువ్వ మూడు మాటలాడేనయ్య
త్రాగునీళ్ళకు కఱువులయ్యేనయా
తాటిచెట్టుమీద తాబేలు పలికింది
తలంబ్రాలు వానకురిసేనయా
మూడునెలలకు కఱువు లొచ్చేనయా
నల్లగొండావల నాగులారముకాడ
నాల్గుకాళ్ళ కోడి పుట్టేనయా
అరువయాయాముడ కూసేనయా
ఆదివారమునాడు ఆబోతుగర్భాన
హనుమంతుడూ పుట్టి పెరిగేనయా
హనుమంతునకు పోయి మ్రొక్కేరయా

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!