" జ్ఞాన సుధా లహరి ------------- " దివ్య వాణి -- వేదములు .!


" జ్ఞాన సుధా లహరి
-------------
" దివ్య వాణి -- వేదములు
----------------------
" వేదములు -- అపౌరుషేయములు , అనంత మైనవి. వేదములు నేర్చుకున్నా మనటము పొరపాటు. పూర్వము వేదాధ్యయనము చేయ తలచి భరద్వాజ మహర్షి బ్రహ్మ దేవుని అనుజ్ఞ
పొందాడు. కానీ, తన ఆయువు వేదాధ్యయనానికి చాలదని బ్రహ్మదేవుని ప్రార్థించి దీర్ఘాయువు
వరంగా పొంది , మూడు బ్రహ్మ దినాలు అనగా , 28 మనువుల కాలము బ్రహ్మకు ఒక రోజు .
అనగా ఒక మనువు కాలము , 30, 67 , 20 , 000 సంవత్సరాలు. అట్టి 28 మనువుల
కాలము , 30 , 67 , 20 , 000 x 28 ఇది బ్రహ్మకు ఒకరోజు . అట్టి 3 బ్రహ్మ దినాలు అనగా ,
30, 67, 20, 000 x 28 x 3 = 25, 76, 44, 80, 000 సంవత్సరాల ఆయుర్దాయము పొందాడు.
ఇన్ని సంవత్సరాలు వేదాలను అధ్యయనం చేశాడు. భరద్వాజ మహర్షి అంత చేసినా , ఆవగింజలో ఆరవ వంతైనా పూర్తి చేయలేక పోయాడట ! అందుచే విచార గ్రస్తుడై వుండగా తిరిగి
బ్రహ్మ సాక్షాత్కరించి , " మహర్షీ ! వేదాలు పూర్తిగా తెలుసుకోవటము ఎవరి తరమూ కాదు ! అదుగో , ఆ వేదరాశి ! ఆ వేదరాశిని చూడు ! అని , " మేరు పర్వతము వంటి వేదాల గుట్టను "
చూపాడు . అంతట భరద్వాజుడు ," దేవా ! అందులో నుండి మానవాళి గ్రహించ గలిగినంత ప్రసాదించు " అని వేడుకున్నాడు . అప్పుడు బ్రహ్మ మూడు గుప్పెళ్ళ వేదము అతనికి ప్రసాదించగా దాని అధ్యయనమే ఆయనకింకా పూర్తి కాలేదు . ఇక అల్పాయుష్కులైన సామాన్య
మానవులనగా నెంత ? అల్పాయుష్కులైన మానవులు ఆ వేదమును పూరా అధ్యయనము
చేయలేరు.
గనుకే , శ్రీమన్నారాయణుడు స్వయంగా శ్రీ వేదవ్యాస మహర్షిగా అవతరించి ఆ వేదాన్ని
ఋగ్వేదము , యజుర్వేదము , సామ వేదము , అధర్వణవేదము అనే నాలుగు భాగాలుగా
విభాజించాడు . అందులో ఋగ్వేదం - పైలుడనే ఋషికి ; యజుర్వేదము - వైసంపాయనునికి ;
సామవేదము - జైమినికీ ; అధర్వణ వేదము - సుమంతునకు బోధించాడు . వ్యాస భగవానుని
శిష్యులైనవారు నల్గురు ఋషులు పూర్తి అధ్యయనము చేయలేక పోయారు. పూర్తీ చేసిన దానిలో
ఈ వివరాలు కొన్ని బయట పడ్డాయి. దానినే వివరించడమైనది - ఈ నాలుగు వేదములయందు."
" ఓం పర బ్రాహ్మణే నమః ".
((((((((())))))))).

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!