శుభరాత్రి.! . కాశీలో చంద్రుడు ఏం చేశాడో ఇప్పుడు వర్ణిస్తున్నాడు శ్రీనాధుడు .


శుభరాత్రి.!
.
కాశీలో చంద్రుడు ఏం చేశాడో ఇప్పుడు వర్ణిస్తున్నాడు శ్రీనాధుడు .
‘’అభిషేక మొనరించు నమృత ధారా వృష్టి –మదనాంతకుని ముక్తి మంటపికకు నలవోకగా విశాలాక్షీ మహాదేవి –నిద్దంపు జెక్కుల నీడ జూచు నేరియిం చు మిన్నేటి ఇసుక తిన్నెల మీద –జక్రవాకాం గనా సముదయంబు డుంఠి విఘ్నేషు నిష్టుర కంఠ వేదిపై-గోదమ చుక్కల రాజు గుస్తరించు గాయు వెన్నెల యానంద కాననమున –గాల భైరావు దంష్ట్ర లకు డాలుకొలుపు విధుడు వారాణసీ సోమ వీధి చక్కి –నాభ్ర ఘంటా పదంబు నరుగు నపుడు ‘’
.
భావం –చంద్రుడు కాశీ నగరం లోని సోమ వీధి ప్రాంతముపై ఆకాశ వీధిలో సంచ రించే టప్పుడు –విశ్వేశ్వరుని ముక్తి మంటపాన్ని వెన్నెల వర్షం తో అభిషేకిస్తాడు
.విశాలాక్షీ దేవి స్వచ్చమైన చెక్కిళ్ళపై ప్రతి బిం బిస్తాడు .గంగానది ఇసుక తిన్నెలపై ఆడ చక్ర వాక లను బాధ పెడతాడు .డుంఠి వినాయకుని కంఠము దగ్గరున్న చంద్రుడిని లాలిస్తాడు కాశీ మీద వెన్నెల కురిపిస్తాడు క్షేత్ర రక్షకుడైన కాల భైరవుని కోరకు కాంతి నిస్తాడు .చంద్ర బింబం లోని మచ్చ ఎందుకు ఏర్పడింది అంటే రోహిణీ దేవి చంద్రుడిని కౌగిలిమ్చుకోవటం వలన ఏర్పడిన కస్తూరి పూతవలన ,రాహువు కోరతో కొత్తగా ఏర్పడ్డ చిల్లి లో కనబడే ఆశం ముక్క వలన ,స్వచ్చం గా ఉండటం చేత కొరికి మింగిన చీకటి వలన ,,పుట్టినప్పుడు మందర పర్వతం రాసుకోవటం వల్లఏర్పడిన కాయ వలన ,విరహం తో తాపం చెందే ఆడ చక్ర వాకాల కడగంటి చూపు అనే నిప్పు వల్ల కలిగిన ఇంట్లోని ధూమం వలన అని శ్రీనాధుడు ఉత్ప్రేక్షించాడు ..రాత్రి అంతా వెన్నెల స్నానం తో జనం పులకరించిపోయారు .మళ్ళీ సూర్యోదయం అవ్వాలి .నిత్య కర్మానుస్టాలు ప్రారంభ మవ్వాలి

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!