పాలను వెన్నయు మ్రుచ్చిల.....శ్రీ కృష్ణ శతకం.!........( 9/6/15)... (శ్రీ నరసింహ కవి.)







.
శ్రీ కృష్ణ శతకం.!........( 9/6/15)... (శ్రీ నరసింహ కవి.)
.
పాలను వెన్నయు మ్రుచ్చిల
రోలను మీ తల్లిగట్ట రోషముతోడన్
లీలావినోదివైతివి
బాలుడవా బ్రహ్మగన్న ప్రభుడవు కృష్ణా!
.
భావం: ఓ కృష్ణా! నువ్వు నీ ఇంట్లోవే కాక ఇరుగుపొరుగు ఇళ్లనుంచి కూడా పాలువెన్నలను దొంగిలించావు. అందుకు నీ తల్లికి కోపం వచ్చి నిన్ను తాడుతో రోలుకి కట్టింది. దానిని నువ్వు ఒక లీలావినోదంగా చూశావు. నువ్వు బ్రహ్మదేవుడికి జన్మనిచ్చిన దేవదేవుడివి. అంతేకాని నువ్వు పసిపిల్లవాడివి మాత్రం కావు.
ప్రతిపదార్థం: పాలను అంటే క్షీరాన్ని; వెన్నయు
.అంటే వెన్నను; మ్రుచ్చిలన్ అంటే దొంగిలించగా; రోషముతోడన్ అంటే కోపంతో;
నీ తల్లి అంటే నీ తల్లి అయిన యశోద; రోలను అంటే రోటికి;
కట్టన్ అంటే తాడుతో బంధించగా; లీలావినోదివి + ఐతివి అంటే ఆటలలో కలిగే సంతోషాన్ని అనుభవించావు;
బాలుడవా అంటే నువ్వు సామాన్య పసిబాలుడివా;
బ్రహ్మగన్న అంటే బ్రహ్మదేవుని ప్రభవించిన; ప్రభుడవు అంటే గొప్ప

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!